By
Rajesh Karampoori
| Published: Saturday, December 27, 2025, 21:41 [IST]
Kajal Aggarwal: 2025 ముగింపు సందర్భంగా కాజల్ అగర్వాల్ షేర్ చేసిన వైట్ డ్రెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె యంగ్ లుక్స్, స్టైల్, ఫ్యామిలీ మూమెంట్స్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.
1/6
Kajal Agarwal: ట్రెండీ లుక్ లో అగర్వాల్ ఎంత క్యూట్ గా ఉందో చూశారా ? | Kajal Aggarwal’s White Dress Photos Go Viral, Fans Praise Her Timeless Charm - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwals-white-dress-photos-go-viral-fans-praise-her-timeless-charm-fb104429.html
టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోయినా, ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 2025 ముగింపు సందర్భంగా కాజల్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా వైట్ డ్రెస్‌లో కనిపించిన కాజల్ లుక్స్ ఇప్పుడు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి.
2/6
Kajal Agarwal: ట్రెండీ లుక్ లో అగర్వాల్ ఎంత క్యూట్ గా ఉందో చూశారా ? | Kajal Aggarwal’s White Dress Photos Go Viral, Fans Praise Her Timeless Charm - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwals-white-dress-photos-go-viral-fans-praise-her-timeless-charm-fb104429.html#photos-1
కాజల్ పోస్ట్ చేసిన ఫోటోలలో ఆమె వైట్ స్కర్ట్, సింపుల్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో చాలా ఎలిగెంట్‌గా కనిపించింది. “ఇంకా యంగ్‌గానే ఉంది”, “ఏజ్ అసలు కనిపించడం లేదు” అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌పై కామెంట్స్ చేస్తున్నారు. అయినప్పటికీ, కాజల్ ఫోటోలపై సోషల్ మీడియాలో ఒక్కటే రచ్చ నడుస్తోంది.
3/6
Kajal Agarwal: ట్రెండీ లుక్ లో అగర్వాల్ ఎంత క్యూట్ గా ఉందో చూశారా ? | Kajal Aggarwal’s White Dress Photos Go Viral, Fans Praise Her Timeless Charm - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwals-white-dress-photos-go-viral-fans-praise-her-timeless-charm-fb104429.html#photos-2
ఈ ఫోటోలతో పాటు కాజల్ తన ఫ్యామిలీతో కలిసి దిగిన కొన్ని క్యూట్ మూమెంట్స్‌ను కూడా షేర్ చేసింది. భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెటిజన్స్‌ను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్న కాజల్ లైఫ్‌ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
4/6
Kajal Agarwal: ట్రెండీ లుక్ లో అగర్వాల్ ఎంత క్యూట్ గా ఉందో చూశారా ? | Kajal Aggarwal’s White Dress Photos Go Viral, Fans Praise Her Timeless Charm - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwals-white-dress-photos-go-viral-fans-praise-her-timeless-charm-fb104429.html#photos-3
లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కాజల్, చందమామ, మగధీర వంటి సినిమాలతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. మగధీరలో మిత్రవింద పాత్రతో ఆమె క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన నటించి, వరుస హిట్స్‌తో ఇండస్ట్రీని ఏలింది.
5/6
Kajal Agarwal: ట్రెండీ లుక్ లో అగర్వాల్ ఎంత క్యూట్ గా ఉందో చూశారా ? | Kajal Aggarwal’s White Dress Photos Go Viral, Fans Praise Her Timeless Charm - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwals-white-dress-photos-go-viral-fans-praise-her-timeless-charm-fb104429.html#photos-4
కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్, కొడుకుకు జన్మనిచ్చి కొంతకాలం ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇచ్చింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో కనెక్ట్ అవుతోంది.
6/6
Kajal Agarwal: ట్రెండీ లుక్ లో అగర్వాల్ ఎంత క్యూట్ గా ఉందో చూశారా ? | Kajal Aggarwal’s White Dress Photos Go Viral, Fans Praise Her Timeless Charm - Filmibeat Telugu
/photos/feature/kajal-aggarwals-white-dress-photos-go-viral-fans-praise-her-timeless-charm-fb104429.html#photos-5
సినిమాలు లేకపోయినా కాజల్ అగర్వాల్ పేరు మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది. లేటెస్ట్ వైట్ డ్రెస్ ఫోటోలతో మరోసారి తన అందం, స్టైల్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. రాబోయే రోజుల్లో ఆమె కొత్త ప్రాజెక్ట్స్‌తో తిరిగి వెండితెరపై సందడి చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.