bredcrumb

కావ్యా థాపర్ అందాల జాతర.. నెట్టింట హల్‌చల్ చేస్తున్న లేటెస్ట్ పిక్స్!

By Rajesh Karampoori
| Published: Friday, July 24, 2026, 20:21 [IST]

Kavya Thapar: అందాల భామ కావ్యా థాపర్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ‘నేను రెడీ’ సినిమా ఈవెంట్‌లో పర్పుల్ స్టైలిష్ డ్రెస్‌లో మెరిసి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె గ్లామరస్ లుక్, అందమైన చిరునవ్వు, స్టైలిష్ పోజులతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి. 

Kavya Thapar
1/5


అందాల భామ కావ్యా థాపర్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ‘నేను రెడీ’ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్నారు.  ఈ బ్యూటీ.. పర్పుల్ కలర్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోయారు. తన అందమైన చిరునవ్వు, స్టైలిష్ లుక్స్, గ్లామరస్ ప్రెజెన్స్‌తో కెమెరాలన్నింటినీ తనవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

Kavya Thapar
2/5

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కావ్యా థాపర్.. తరచూ తన ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తుంటారు. ఈసారి కూడా ట్రెండీ డ్రెస్‌లో ఇచ్చిన స్టిల్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. కొంటె చూపులు, స్టైలిష్ పోజులు, నేచురల్ స్మైల్‌తో ఆమె ఇచ్చిన ప్రతి ఫ్రేమ్ అభిమానుల నుంచి భారీ స్పందనను అందుకుంటోంది. "పర్పుల్ బ్యూటీ", "గార్జియస్ లుక్", "స్టన్నింగ్ క్వీన్" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Kavya Thapar
3/5

మహారాష్ట్రలో జన్మించిన కావ్యా థాపర్.. హిందీ షార్ట్ ఫిల్మ్ ‘తత్కాల్’తో తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం పలు ప్రముఖ బ్రాండ్ల ప్రకటనల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘ఈ మాయ పేరేమిటో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు, ‘ఏక్ మినీ కథ’ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘విశ్వం’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

Kavya Thapar
4/5

ప్రస్తుతం కావ్యా థాపర్ నటిస్తున్న తాజా చిత్రం ‘నేను రెడీ’. హవీష్ హీరోగా నటిస్తున్న ఈ కుటుంబ కథా చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్నారు. హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిఖిల కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ప్రత్యేక ఐటమ్ సాంగ్‌తో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై మంచి ఆసక్తిని పెంచింది.

Kavya Thapar
5/5

ఇక ‘నేను రెడీ’ ఈవెంట్‌లో కావ్యా థాపర్ స్టైలింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింపుల్ మేకప్, ఎలిగెంట్ లుక్, గ్లామరస్ అవుట్‌ఫిట్‌తో ఆమె రెడ్ కార్పెట్‌పై మెరిసిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు వరుసగా లైక్స్, కామెంట్స్‌తో ప్రేమను కురిపిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే కావ్యా థాపర్ మరోసారి తన గ్లామర్‌తో వార్తల్లో నిలవడం విశేషం.

X