By
Siva Kodati
| Published: Thursday, July 23, 2026, 09:48 [IST]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన మూవీ చెన్నై లవ్‌స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
1/8
చిరంజీవి అంటే పేరు కాదు.. ఒక ఎమోషన్.. హీరో కిరణ్ అబ్బవరం | Kiran Abbavaram Emotional About Mega Star Chiranjeevi In Chennai Love Story Mega Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/kiran-abbavaram-emotional-about-mega-star-chiranjeevi-in-chennai-love-story-mega-pre-release-event-fb109186.html
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా తెరకెక్కిన మూవీ చెన్నై లవ్‌స్టోరీ. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌లు ఈ సినిమాను నిర్మించగా.. రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయి రాజేశ్ ఈ సినిమాకు కథను అందించారు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ చాలాకాలం తర్వాత ఈ మూవీకి సంగీతం అందించారు. సంతోష్ నాయుడు ఎడిటర్‌గా, విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. జూలై 24న చెన్నై లవ్ స్టోరీ విడుదల కానుంది.
2/8
చిరంజీవి అంటే పేరు కాదు.. ఒక ఎమోషన్.. హీరో కిరణ్ అబ్బవరం | Kiran Abbavaram Emotional About Mega Star Chiranjeevi In Chennai Love Story Mega Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/kiran-abbavaram-emotional-about-mega-star-chiranjeevi-in-chennai-love-story-mega-pre-release-event-fb109186.html#photos-1
రిలీజ్ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాల్లో దూసుకెళ్తోంది ఈ చిత్ర యూనిట్. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలలో పలు ఈవెంట్స్ నిర్వహించింది. తాజాగా జూలై 22న హైదరాబాద్‌లో చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌ని ఆశీర్వదించారు.
3/8
చిరంజీవి అంటే పేరు కాదు.. ఒక ఎమోషన్.. హీరో కిరణ్ అబ్బవరం | Kiran Abbavaram Emotional About Mega Star Chiranjeevi In Chennai Love Story Mega Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/kiran-abbavaram-emotional-about-mega-star-chiranjeevi-in-chennai-love-story-mega-pre-release-event-fb109186.html#photos-2
చిరంజీవి మాట్లాడుతూ.. చెన్నై పేరు వినగానే ఆ నగరంతో నాకున్న అనుబంధమే గుర్తొస్తోంది. ఇక్కడే మనల్ని మనం నిరూపించుకోవాలనే కసితో చెన్నై రోడ్ల మీద తిరుగుతూ.. అదే రోడ్ల మీద కార్లతో తిరుగుతూ, అదే రోడ్ల మీద స్టార్ డైరెక్టర్స్‌తో ముందుకెళ్లిన రోజులు గుర్తొచ్చాయి. చెన్నై టైటిల్‌లో మేజిక్ ఉంది. ఎస్‌కేఎన్, సాయిరాజేష్, రవివర్మ, కిరణ్ అబ్బవరం బ్రదర్ నా అభిమానులే.. కిరణ్ మాత్రం పవన్ కళ్యాణ్ అభిమాని. మణిశర్మ నాకు మరో తమ్ముడు.. అనంత్ శ్రీరామ్ వంటి వారితో నాకు అనుబంధం ఉందని చిరంజీవి తెలిపారు.
4/8
చిరంజీవి అంటే పేరు కాదు.. ఒక ఎమోషన్.. హీరో కిరణ్ అబ్బవరం | Kiran Abbavaram Emotional About Mega Star Chiranjeevi In Chennai Love Story Mega Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/kiran-abbavaram-emotional-about-mega-star-chiranjeevi-in-chennai-love-story-mega-pre-release-event-fb109186.html#photos-3
ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కరిదే కాదు.. ప్రతి ఒఖ్కరికి అవకాశం ఇస్తుంది. కిరణ్ అబ్బవరం ఫ్యూచర్ స్టార్. ఎక్కడో రాయచోటిలో పుట్టాడు.. తిరుపతి వరకు వెళ్లి చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, రామ్ చరణ్ సినిమాలు చూసేవాడు. నేను ఎంతోమంది కిరణ్ అబ్బవరంలకు స్పూర్తి కాకూడదని అనుకున్నాడు. అక్కడి నుంచి ఈ స్థాయికి చేరుకున్నాడు. చేసిన నాలుగైదు సినిమాలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇండస్ట్రీకి కిరణ్ అబ్బవరం వంటి వ్యక్తులు రావాలి.. అప్పుడే ఈ పరిశ్రమ పచ్చగా ఉంటుందని చిరంజీవి చెప్పారు.
5/8
చిరంజీవి అంటే పేరు కాదు.. ఒక ఎమోషన్.. హీరో కిరణ్ అబ్బవరం | Kiran Abbavaram Emotional About Mega Star Chiranjeevi In Chennai Love Story Mega Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/kiran-abbavaram-emotional-about-mega-star-chiranjeevi-in-chennai-love-story-mega-pre-release-event-fb109186.html#photos-4
హీరోయిన్ శ్రీగౌరి ప్రియ కుందనపు బొమ్మలా ఉంది. మన తెలుగింటి అమ్మాయి అని విన్నాను, తెలుగు సినిమాకే పరిమితం కాకుండా ఇతర భాషా చిత్రాలను కూడా చేస్తోంది. అన్నీ భాషల్లోనూ అభివృద్ది చెందాలి, తెలుగు అమ్మాయిలు అన్ని చోట్లా మీ శక్తి సామర్ధ్యాలు చూపించి పైకి ఎదగాలని కోరుకుంటున్నాను అని చిరంజీవి అన్నారు.
6/8
చిరంజీవి అంటే పేరు కాదు.. ఒక ఎమోషన్.. హీరో కిరణ్ అబ్బవరం | Kiran Abbavaram Emotional About Mega Star Chiranjeevi In Chennai Love Story Mega Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/kiran-abbavaram-emotional-about-mega-star-chiranjeevi-in-chennai-love-story-mega-pre-release-event-fb109186.html#photos-5
పెద్ది సినిమా సమయంలో మణిశర్మ గారితో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు. నేను మీ చేత డ్యాన్స్‌లు చేయించడానికి సంగీత దర్శకులు సాయం చేశారు. ఎన్నో సినిమాల్లో నా ఒళ్లు హునం అయిపోయేలా సంగీతం అందించారు మణిశర్మ. మీ అందరి ముందు నేను తెర ముందుకు కనిపించాను, కానీ తెర వెనుక మీరు పడ్డ కష్టం నాకు తెలుసు అని చిరంజీవి అన్నారు.
7/8
చిరంజీవి అంటే పేరు కాదు.. ఒక ఎమోషన్.. హీరో కిరణ్ అబ్బవరం | Kiran Abbavaram Emotional About Mega Star Chiranjeevi In Chennai Love Story Mega Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/kiran-abbavaram-emotional-about-mega-star-chiranjeevi-in-chennai-love-story-mega-pre-release-event-fb109186.html#photos-6
చిరంజీవిగారు, పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్స్ శిల్ప కళా వేదికలో జరుగుతుంటే ఎక్కడో రాయచోటిలోనో, రాజంపేటలోనో టీవీలలో చూశా. అలాంటిది ఈ కిరణ్ అబ్బవరం అనే వాడు సినిమా తీసి ఆ సినిమా ఈవెంట్‌కు చిరంజీవి గారు గెస్ట్‌గా రావడం అనేది అదృష్టం. మా అన్నయ్య గారు చిరంజీవికి అభిమాని, నేను పవన్ కళ్యాణ్ గారికి అభిమానిని. తిరుపతి రాంరాజు థియేటర్‌లో ఇంద్ర సినిమా చూసిన వ్యక్తిని. చిరంజీవి గారు అన్నది ఒక పేరు ఎమోషన్.. మీరు కూడా అచీవ్ చేయొచ్చని ఆయన స్పూర్తిని ఇచ్చారు అని కిరణ్ అబ్బవరం చెప్పారు.
8/8
చిరంజీవి అంటే పేరు కాదు.. ఒక ఎమోషన్.. హీరో కిరణ్ అబ్బవరం | Kiran Abbavaram Emotional About Mega Star Chiranjeevi In Chennai Love Story Mega Pre-Release Event - Filmibeat Telugu
/photos/feature/kiran-abbavaram-emotional-about-mega-star-chiranjeevi-in-chennai-love-story-mega-pre-release-event-fb109186.html#photos-7
హీరోయిన్ శ్రీగౌరి ప్రియ మాట్లాడుతూ.. నా జీవితంలో ఇది మళ్లీ మళ్లీ రాని రోజు. చిరంజీవి గారు మన సినిమా ఈవెంట్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆయన పాటలు చూస్తూ, డ్యాన్స్ చేస్తూ పెరిగాను. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తరువాత భగవంతుడి దయ వల్ల నేను కూడా యాక్టర్‌ని అయ్యాను. అలా నేను నటించిన సినిమాకు సార్ గెస్ట్‌గా రావడం చాలా ఆనందంగా ఉందని శ్రీగౌరి ప్రియ చెప్పారు.