bredcrumb

కొత్త చెవి రింగులతో పాయల్... మంగళవారం బ్యూటీ అల్లరి చూశారా

By Siva Kodati
| Published: Friday, December 26, 2025, 21:32 [IST]

సినీ నటి పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Payal Rajput Photoshoot
1/5

ఒకే ఒక్క సినిమాతో తెలుగునాట పాపులర్ అయ్యారు ఉత్తరాది భామ పాయల్ రాజ్‌పుత్. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఇందుగా ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు.

Payal Rajput Photoshoot
2/5

ఢిల్లీకి చెందిన పాయల్ రాజ్‌పుత్ తొలుత బుల్లితెరపై సత్తా చాటారు. 2010లో స్టార్ ప్లస్‌లో ప్రసారమైన సపోన్ సే భారే నైనా అనే ధారావాహికతో నటనవైపు అడుగులు వేశారు పాయల్ రాజ్‌పుత్. ఆ తర్వాత గుస్తాఖ్ దిల్, ఆఖిర్ బహు భి తో బేటీ హీ హై, యే హై ఆషికీ, ప్యార్ తునే క్యా కియా, కౌన్ హై తదితర ధారావాహికలతో బుల్లితెరపై పాగా వేశారు. 

Payal Rajput Photoshoot
3/5

సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఆర్ఎక్స్ 100 కంటే ముందు పంజాబీలో చెన్నా మెరాయాలో నటించారు పాయల్. అనంతరం హిందీలో వీరేకి వెడ్డింగ్ సినిమాలో నటించారు. ఆర్ఎక్స్ 100 ఘన విజయం సాధించడంతో తెలుగులో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. 

Payal Rajput Photoshoot
4/5

ఎన్టీఆర్ కథానాయకుడు, సితా, ఆర్‌డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఒక అతిథి, తీస్ మార్ ఖాన్, జిన్నా, మామా పేటిక తదితర చిత్రాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. ఆ తర్వాత మరోసారి అజయ్ భూపతి దర్శకత్వంలో చేసిన మంగళవారం సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చారు పాయల్.

Payal Rajput Photoshoot
5/5

తెలుగుతో పాటు పంజాబీ, హిందీ, తమిళ్, కన్నడ భాషలలో పలు చిత్రాలలో నటించారు పాయల్ రాజ్‌పుత్. ప్రస్తుతం తమిళంలో గోల్‌మాల్, ఏంజెల్‌తో పాటు తెలుగులో కిరాతక సినిమాలలో పాయల్ రాజ్‌పుత్ నటిస్తున్నారు. ఇవన్నీ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+