bredcrumb

Bhagyashri Borse: లెనిన్‌లో భారతిగా భాగ్యశ్రీ బోర్సే... ఫస్ట్ లుక్‌ పోస్టర్ చూశారా?

By Siva Kodati
| Published: Friday, January 2, 2026, 20:36 [IST]

భాగ్యశ్రీ బోర్సే లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. అక్కినేని అఖిల్ సరసన ఆమె నటిస్తోన్న లెనిన్ మూవీ నుంచి భాగ్యశ్రీ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Bhagyashri Borse Photos
1/5

మరాఠీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వరుసగా ఆఫర్లు అందుకుంటున్నప్పటికీ ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అలాగని ఆఫర్లు కూడా ఆగడం లేదు. ఇది ఆమెకు అదృష్టం అనాలో, దురదృష్ణం అనాలో అర్ధం కావడం లేదు.

Bhagyashri Borse Photos
2/5

మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు భాగ్యశ్రీ బోర్సే. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ కెరీర్ అటకెక్కినట్లేనని అంతా భావించారు. కానీ తన అందం, అభినయంతో ఆమె మేకర్స్ కళ్లలో పడ్డారు.

Bhagyashri Borse Photos
3/5

ఆ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్ మూవీలో హీరోయిన్‌గా నటించారు భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అనంతరం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన పీరియాడికల్ మూవీ కాంతలో హీరోయిన్‌గా నటించారు. ఇందులో తన నటనను చూపించి మెస్మరైజ్ చేశారు భాగ్యశ్రీ.

Bhagyashri Borse Photos
4/5

కాంత కూడా డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీపై ఐరెన్ లెగ్ ముద్రపడింది. ఆ  తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ఆమె నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ కూడా ఫ్లాప్ కావడంతో భాగ్యశ్రీ కెరీర్ అగమ్య గోచరంగా మారింది. ఇదే సమయంలో ఆమెకు అదృష్టం అండగా నిలిచింది. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కుతోన్న లెనిన్‌ నుంచి శ్రీలీల తప్పుకోవడంతో ఆమె స్థానంలో భాగ్యశ్రీకి హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. 

Bhagyashri Borse Photos
5/5

అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లు ఈ లెనిన్ మూవీని తెరకెక్కిస్తుండగా.. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె భారతి అనే పాత్రలో నటిస్తున్నారు. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+