bredcrumb

Manjummel Boys Total Collections 5 కోట్ల బడ్జెట్.. మంజుమ్మేల్ బాయ్స్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్లు ఎంతో తెలుసా?

By Rajababu A
| Published: Wednesday, March 20, 2024, 10:40 [IST]
Director Chidambaram's Latest movie is Manjummel Boys. Babu Shahir, Sowbin Shahir, Shwan Anthony are the producers. This movie made of 5 croress budget. And Released in Tamil, Malayalam in Grand Manner. Here is the Movie Total Collectons Worldwide.
Manjummel Boys Total box Office Collections
1/10

పరవ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీ గోకుళం మూవీస్ సహకారంతో దర్శకుడు చిదంబరం రూపొందించిన చిత్రం మంజుమ్మేల్ బాయ్స్. బాబు షాహిర్, సౌబీన్ షాహిర్, షాన్ అంథోని నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Manjummel Boys Total box Office Collections
2/10

Manjummel Boys Total box Office Collections
3/10

Manjummel Boys Total box Office Collections
4/10

మంజుమ్మేల్ బాయ్స్ చిత్రం కేరళలో 63 కోట్లు, తమిళనాడులో 54 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లు, తెలుగు, ఇతర రాష్ట్రాల్లో 5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకొని 200 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.
Manjummel Boys Total box Office Collections
5/10

మంజుమ్మేల్ బాయ్స్ చిత్రానికి ఓవర్సీస్‌లో ఎవరూ ఊహించని విధంగా రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాకు నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్, యూఏఈ ప్రాంతాల్లో అనూహ్యమైన కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకు ఒవర్సీస్‌లో 8.5 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
Manjummel Boys Total box Office Collections
6/10

ఇక తొలి రోజు నుంచి సంచలన రీతిలో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టిన ఈ చిత్రం తొలివారంలో 27 కోట్లు, రెండో వారంలో 37 కోట్ల రూపాయలు,మూడో వారంలో 34 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక నాలుగో వారంలో కూడా సుమారుగా 14 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో కేవలం తమిళం, మలయాళంలోనే ఈ సినిమా 110 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది.
Manjummel Boys Total box Office Collections
7/10

చిదంబరం దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా తొలి రోజు నుంచే భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజు 3.5 కోట్లు, రెండో రోజు 3.5 కోట్లు, మూడో రోజు 4.5 కోట్లు, నాలుగో రోజు 5 కోట్లు వసూలు చేసింది. దాంతో కేవలం నాలుగు రోజుల్లోనే 16 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
Manjummel Boys Total box Office Collections
8/10

మంజుమ్మేల్ బాయ్స్ చిత్రాన్ని కేవలం మలయాళం, తమిళంలోనే రిలీజ్ చేశారు. కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో మలయాళం వెర్షన్ రిలీజ్ చేయగా భారీ స్పందన లభించింది. ఈ సినిమాను మలయాళంలో 400 స్క్రీన్లు, ఇతర నగరాల్లో 100 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
Manjummel Boys Total box Office Collections
9/10

అడ్వంచరస్, సస్పెన్స్, థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన మంజుమ్మేల్ బాయ్స్ చిత్రాన్ని సుమారుగా 5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను మలయాళంలో ప్రముఖ డిస్టిబ్యూటర్స్ శ్రీ గోకుళం మూవీస్ రిలీజ్ చేసింది.
X