bredcrumb

హాఫ్ శారీలో మిరాయ్ బ్యూటీ.. చూపుతోనే మంటపెడుతోన్న రితికా నాయక్

By Siva Kodati
| Published: Tuesday, September 23, 2025, 20:38 [IST]

హీరోయిన్ రితికా నాయక్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

Ritika Nayak Photos
1/5

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం మిరాయ్. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దాదాపు 140 కోట్ల వసూళ్లతో తేజ సజ్జాకు మరో విజయాన్ని అందించింది. ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రీయా శరణ్‌లు కీలకపాత్రలు పోషించారు. 

Ritika Nayak Photos
2/5

ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతం అందరి చూపూ మిరాయ్‌లో హీరోయిన్‌గా నటించిన రితికా నాయక్ మీదే పడింది. తన క్యూట్ లుక్స్‌తో విడుదలకు ముందే ఈ ముద్దుగుమ్మ.. కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఈ నేపథ్యంలో రితికా నాయక్ గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.

Ritika Nayak Photos
3/5

27 అక్టోబర్ 2000లో ఢిల్లీలో జన్మించింది రితికా నాయక్‌. శ్యామ ప్రసాద్ ముఖర్జీ కాలేజీ ఫర్ ఉమెన్‌లోగ్రాడ్యుయేషన్ చేశారు. వీరిది ఢిల్లీలో స్థిరపడిన ఒడియా కుటుంబం. చదువుల్లో టాపర్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. ఆపై మోడలింగ్‌లో దిగి 2019లో ఢిల్లీలో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ 12వ సీజన్‌లో విజేతగా నిలిచారు. 

Ritika Nayak Photos
4/5

మోడలింగ్ తర్వాత సినీరంగం వైపు అడుగులు వేసిన రితికా సింగ్‌ టాలీవుడ్‌తోనే తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలుత మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా వచ్చిన అశోక వనంలో అర్జున కళ్యాణం చిత్రంలో ఓ కీలకపాత్ర పోషించారు. ఇందులో వసుధగా ఆమె అద్భుతంగా నటించారు. ఇందుకు గాను సైమా అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ కేటగిరీలో అవార్డ్ అందుకున్నారు 

Ritika Nayak Photos
5/5

అనంతరం నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన హాయ్ నాన్నలో ఆయనకు కూతురిగా రితిక గెస్ట్ రోల్ పోషించారు. ఈ క్రమంలోనే రితికకు మిరాయ్‌లో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాతో పాటు డ్యూయెట్, వీటీ 15 చిత్రాల్లో రితికా నాయక్ నటిస్తున్నారు. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+