bredcrumb

పొట్టి డ్రెస్‌లో ఇస్మార్ట్ హీరోయిన్ ఫోజులు.. నెట్టింట వైరలవుతున్న హాట్ ఫొటోస్!

By Rajesh Karampoori
| Published: Monday, December 29, 2025, 20:20 [IST]

Nabha Natesh: బ్లాక్ మినీ డ్రెస్‌లో నభా నటేష్ షేర్ చేసిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్, ఫిట్‌నెస్‌తో మరోసారి కంబ్యాక్‌కు సిద్ధమవుతుంది. ఈ భామ లేటెస్ట్ ఫోటోలపై మీరు కూడా  ఓ లూక్కేయండి.  

Nabha Natesh
1/6

బిగినింగ్ లోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నభా నటేష్.  ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, నభాకు మంచి గుర్తింపు తెచ్చింది. అంతకుముందే ఆమె కొన్ని కన్నడ చిత్రాల్లో నటించి అనుభవం సంపాదించింది. అయితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’తో ఆమె కెరీర్ ఒక్కసారిగా టర్నింగ్ పాయింట్ తీసుకుంది.

Nabha Natesh
2/6

‘ఇస్మార్ట్ శంకర్’లో గ్లామర్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో నభా యువతను ఆకట్టుకుంది. ఆ తర్వాత డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్, మాస్ట్రో వంటి సినిమాల్లో నటించి నటిగా మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలు ఆమెకు నటనపరంగా గుర్తింపు ఇచ్చినా, ఇస్మార్ట్ శంకర్ స్థాయి సక్సెస్ మాత్రం రాలేదు.

Nabha Natesh
3/6

ఈ మధ్య జరిగిన ప్రమాదం కారణంగా కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన నభా, ఇప్పుడు పూర్తిగా కోలుకుని తిరిగి సెట్స్‌పైకి అడుగుపెట్టింది. ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభూ’ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతానికి ఇదే ఆమె చేతిలో ఉన్న ఏకైక ప్రాజెక్ట్.

Nabha Natesh
4/6

ఇక ఫిట్నెస్ విషయానికొస్తే, యాక్సిడెంట్ తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిందని నభా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మొబిలిటీ ఎక్సర్సైజులు, స్విమ్మింగ్, డాన్సింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నానని తెలిపింది. హీరోయిన్ కాబట్టి కాదు, తన శరీరంపై అవగాహన పెరిగిందని చెప్పిన నభా, ఇప్పుడు ఆరోగ్యంతో పాటు గ్లామర్‌ను బ్యాలెన్స్ చేస్తూ మరోసారి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

Nabha Natesh
5/6

ఒకప్పుడు భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకున్న నభా నటేష్‌కు మధ్యలో అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత గ్యాప్ రావడంతో సినిమాల నుంచి కాస్త దూరమైంది. ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సంపాదించుకోవడానికి సోషల్ మీడియానే వేదికగా చేసుకుని గ్లామర్ షోతో అటు అభిమానులను, ఇటు దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.  

Nabha Natesh
6/6

తాజాగా హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా బ్లాక్ కలర్ మినీ డ్రెస్‌లో ఆమె షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మినీ టాప్, షార్ట్‌తో నడుము అందాలను హైలైట్ చేస్తూ ఇచ్చిన పోజులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలకు భారీ లైక్స్, కామెంట్స్ వస్తుండటంతో నభా మళ్లీ ఫోకస్‌లోకి వచ్చింది.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+