bredcrumb

గ్రీస్‌లో ఎంజాయ్ చేస్తోన్న ప్రణీత... స్విమ్మింగ్ పూల్‌లో రొమాంటిక్ ఫోజులు!

By Siva Kodati
| Published: Monday, November 24, 2025, 21:06 [IST]

హీరోయిన్ ప్రణీత సుభాష్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా గ్రీస్ పర్యటనకు వెళ్లిన ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది

Pranitha Subhash Photos
1/5

కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు కలువ కళ్ల ప్రణీత సుభాష్. అందం, అభినయం పరంగా మంచి మార్కులు వేయించుకున్న ఈ ముద్దుగుమ్మకు అదృష్టం కలిసి రాలేదు. హీరోయిన్‌గా ఒకటి రెండు సినిమాలు చేసిన ప్రణీతకు ఆ తర్వాత సెకండ్ లీడ్‌గానే ఛాన్స్‌లు వచ్చాయి.

Pranitha Subhash Photos
2/5

బెంగళూరులో పుట్టి పెరిగిన ప్రణీత 2010లో దర్శన్ హీరోగా వచ్చిన పోక్రీతో నటిగా తన సినీ ప్రస్థానం ప్రారంభించారు. తెలుగులో సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ పోకిరికి రీమేక్ ఈ చిత్రం. ఇందులో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ హీరోగా నటించారు.

Pranitha Subhash Photos
3/5

తనీష్ హీరోగా వచ్చిన ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు ప్రణీత.. ఆ తర్వాత బావ, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్, బ్రహ్మోత్సవం, మాస్ లీడర్, హలో గురు ప్రేమిస్తా, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలతో తెలుగువారిని అలరించారు.

Pranitha Subhash Photos
4/5

తెలుగులో అనుకున్న స్థాయిలో స్టార్‌డమ్ దక్కకపోవడంతో ప్రణీత తమిళం, మలయాళంలపై ఫోకస్ పెట్టారు. అయితే అక్కడా అదృష్టం కలిసిరాలేదు. చివరికి హిందీలో తన ఫేట్ మారుతుందని అనుకుని హంగామా 2, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాలో నటించినా అక్కడే అదే సెంటిమెంట్ రిపీట్ అయ్యింది.

Pranitha Subhash Photos
5/5

చివరిసారిగా 2024లో కన్నడలో రమణ అవతార అనే సినిమాలో నటించారు ప్రణీత సుభాష్. బెంగళూరుకు చెందిన నితిన్ రాజు అనే వ్యక్తిని 2021లో పెళ్లాడారు ప్రణీత. ఈ దంపతులకు తొలుత కుమార్తె, గతేడాది కుమారుడు జన్మించారు. ప్రస్తుతం భర్త, పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రణీత సుభాష్.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+