bredcrumb

శృతిమించిన అందాల జాతర.. చెమటలు పట్టిస్తున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ..

By Rajesh Karampoori
| Published: Saturday, November 22, 2025, 19:56 [IST]

Raashi Khanna: టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా తాజా గ్లామర్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్టైలిష్ లుక్స్‌తో కుర్రాళ్లను కవ్విస్తున్న రాశి పిక్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.   

Raashi Khanna
1/6

టాలీవుడ్‌కు రాశి ఖన్నా పేరు కొత్త కాదు. “ఊహలు గుసగుసలాడే” చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన రాశి, తన తొలి సినిమాతోనే అందమైన లుక్స్, న్యాచులర్ ఎక్స్ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులకు క్యూట్ లుక్ అంటే రాశి అని చెప్పుకునేంతలా పాపులర్ అయ్యింది. తొలి సినిమానే మంచి పేరు తెచ్చుకోవడంతో తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు దక్కాయి.

Raashi Khanna
2/6

రాశి ఖన్నా.. జోరు, జిల్, బెంగాల్ టైగర్, శివం, సుప్రీమ్, హైపర్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ వంటి పలు చిత్రాల్లో నటించినప్పటికీ పెద్ద హిట్ మాత్రం దక్కలేదు. జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్య వంటి స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ ఆమె స్టార్‌డమ్ స్థాయిలో ఎదగలేకపోయింది. మధ్యలో కొంత బరువు పెరగడం వల్ల కూడా అవకాశాలు తగ్గిపోయాయని రాశి పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది.

Raashi Khanna
3/6

తెలుగులో పెద్దగా అవకాశాలు రాక, రాశి బాలీవుడ్ వైపు మళ్లింది. అక్కడ బోల్డ్ రోల్స్ చేస్తూ తన విభిన్న శైలిని చూపించింది. యోధ, ది సబర్మతి రిపోర్ట్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ అక్కడ కూడా సంచలన స్థాయి విజయాలు దక్కలేదు. 

Raashi Khanna
4/6

బాలీవుడ్ తర్వాత తమిళ ఇండస్ట్రీ మాత్రం రాశిని మళ్లీ లైమ్‌లైట్‌లోకి తెచ్చింది. సుందర్ సి దర్శకత్వంలోని ‘అరణ్మనై 4’లో రాశి, తమన్నా కీలక పాత్రలు పోషించగా ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఆమె కెరీర్‌లో మరో మలుపు. ఈ విజయంతో రాశిపై మళ్లీ దృష్టి పడటం ప్రారంభమైంది.

Raashi Khanna
5/6

 ఇటీవల సిద్దు జొన్నలగడ్డతో కలిసి చేసిన ‘తెలుసు కదా’ సినిమా మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో రాశి ఖన్నా టాలీవుడ్‌లో మళ్లీ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ఆమె టాలీవుడ్ కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Raashi Khanna
6/6

సినిమాలో రాణించినంతగా రాశి సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ కలిగి ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ గ్లామర్ ఫోటోషూట్స్, స్టైలిష్ లుక్స్‌తో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. రాశి ఖన్నా అందం, ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అభిమానులు ఆమెను మళ్లీ స్టార్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తుంది.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+