bredcrumb

చీరలో గత్తరలేపుతున్న శ్రీలీల.. చూస్తే చూపు తిప్పుకోలేరు

By Rajesh Karampoori
| Published: Monday, November 17, 2025, 19:48 [IST]

Sreeleela: స్టార్ హీరోయిన్ శ్రీలీల లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. గ్లామర్ లుక్‌తో ఫ్యాన్స్ చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఈ అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

Sreeleela’s latest photoshoot
1/6

ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నాయికల్లో శ్రీలీల ఒకరు. ఎంట్రీ ఇచ్చి కొద్దికాలంలోనే స్టార్ రేంజ్‌కు చేరిన ఆమె అందం, ఎనర్జీ, డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

Sreeleela’s latest photoshoot
2/6

‘పెళ్లి సందడి’తో సినీ ప్రయాణం మొదలైన శ్రీలీలకు ‘ధమాకా’ అసలు టర్నింగ్ పాయింట్ అయ్యింది. రవితేజ సరసన చేసిన ఆ చిత్రంలోని డ్యాన్స్ నంబర్లు ఆమెకు చెరగని క్రేజ్ తెచ్చాయి.

Sreeleela’s latest photoshoot
3/6

తర్వాత వరుసగా ‘స్కంద’, ‘గుంటూరు కారం’ వంటి పెద్ద ప్రాజెక్టుల్లో నటించింది. ‘పుష్ప 2’ స్పెషల్ సాంగ్ చేస్తూ పాన్ ఇండియా లెవెల్‌లో కూడా పాపులారిటీ అందుకుంది.

Sreeleela’s latest photoshoot
4/6

తాజాగా రవితేజతో వచ్చిన ‘మాస్ జాతర’లో శ్రీకాకుళం యాసలో మెప్పించిన శ్రీలీల, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళంలో ‘పరాశక్తి’తో ఎంట్రీ ఇస్తోంది.

Sreeleela’s latest photoshoot
5/6

ఇంతలో బాలీవుడ్ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంది. అనురాగ్ బసు తీస్తున్న ‘అషికీ 3’లో కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తోంది. వీరిద్దరి కెమిస్ట్రీపై ఇప్పటికే హాట్ టాక్ మొదలైంది.

Sreeleela’s latest photoshoot
6/6

హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పటికీ, వృత్తిరీత్యా డాక్టర్ అయిన శ్రీలీల రెండు అనాధ పిల్లలను దత్తత తీసుకుని చూసుకుంటోంది. అందం, అభినయం, మంచి హృదయం  ఈ మూడు ఆమెను టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోయేలా చేస్తున్నాయి.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+