By
Siva Kodati
| Published: Saturday, July 25, 2026, 18:17 [IST]
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ జూలై 24న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో శనివారం జరిగింది. ఈ ఈవెంట్ ఫోటోలు మీకోసం
1/6
Chennai Love Story: అమ్మ ఉండుంటే చాలా సంతోషించేది.. శ్రీగౌరీ ప్రియ కంటతడి | Sri Gouri Priya Gets Emotional At Chennai Love Story Movie Success Meet. Here Are The Photos - Filmibeat Telugu
/photos/feature/sri-gouri-priya-gets-emotional-at-chennai-love-story-movie-success-meet-here-are-the-photos-fb109250.html
కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ హీరో హీరోయిన్లుగా రవి నంబూరి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ చెన్నై లవ్ స్టోరీ. మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌లు ఈ సినిమాను నిర్మించారు. జూలై 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన చెన్నై లవ్ స్టోరీ మూవీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధికంగా 13.2 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
2/6
Chennai Love Story: అమ్మ ఉండుంటే చాలా సంతోషించేది.. శ్రీగౌరీ ప్రియ కంటతడి | Sri Gouri Priya Gets Emotional At Chennai Love Story Movie Success Meet. Here Are The Photos - Filmibeat Telugu
/photos/feature/sri-gouri-priya-gets-emotional-at-chennai-love-story-movie-success-meet-here-are-the-photos-fb109250.html#photos-1
ఈ నేపథ్యంలో చెన్నై లవ్ స్టోరీ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో జూలై 25న సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని ఒకరినొకరు అభినందించుకున్నారు. తమకు మెమొరబుల్ హిట్ దొరకడంతో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ ఎమోషనల్ అయ్యారు.
3/6
Chennai Love Story: అమ్మ ఉండుంటే చాలా సంతోషించేది.. శ్రీగౌరీ ప్రియ కంటతడి | Sri Gouri Priya Gets Emotional At Chennai Love Story Movie Success Meet. Here Are The Photos - Filmibeat Telugu
/photos/feature/sri-gouri-priya-gets-emotional-at-chennai-love-story-movie-success-meet-here-are-the-photos-fb109250.html#photos-2
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఇలాంటి రోల్ చేయడం చాలా కష్టం. శ్రీగౌరీ ప్రియ ఎంతో కష్టపడింది, రాత్రిపగలు తేడా లేదు ఎప్పుడూ సెట్‌లో ఉండేది. అందరూ అబ్బాయిల మధ్యలో అమ్మాయిగా దూసుకెళ్లింది. ఈ అమ్మాయికి మంచి పేరు రావాలి, సెక్సెస్ రావాలి అని మనస్పూర్తిగా కోరుకున్నాను. అందరూ గౌరి పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అంటున్నారు. ఇంకా నువ్వు చాలా మంచి సినిమాలు చేయలని కిరణ్ అబ్బవరం ఆకాంక్షించారు.
4/6
Chennai Love Story: అమ్మ ఉండుంటే చాలా సంతోషించేది.. శ్రీగౌరీ ప్రియ కంటతడి | Sri Gouri Priya Gets Emotional At Chennai Love Story Movie Success Meet. Here Are The Photos - Filmibeat Telugu
/photos/feature/sri-gouri-priya-gets-emotional-at-chennai-love-story-movie-success-meet-here-are-the-photos-fb109250.html#photos-3
హీరోయిన్ శ్రీగౌరీప్రియ మాట్లాడుతూ.. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. మా అమ్మ ఉండుంటే చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యే వారు. కానీ మా అమ్మ రూపంలో విశాల గారు, ప్రమోదిని గారు అప్పుడప్పుడు వచ్చి నాకు మంచి మాటలు చెప్పేవారు. ఇందాక వచ్చేటప్పుడు కూడా మీ అమ్మ ఉండుంటే చాలా సంతోషించేది, నీ సక్సెస్‌ను తను చూసుంటే ఇంకా బాగుండేదని అన్నారు. కానీ తను చూస్తోంది, తన వల్లే నాకు ఇంత పేరొచ్చింది. పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేనేం చేయలేను.. నిన్నటి నుంచి ఫోన్ మోగిపోతోంది. మా అమ్మ నా పక్కనే ఉంటారు. మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్‌లోనూ ఒకే రకమైన స్పందన వస్తోంది. నాకు అన్ని విషయాల్లో అండగా నిలిచిన కిరణ్‌కి థ్యాంక్స్ తెలిపారు శ్రీగౌరీ ప్రియ.
5/6
Chennai Love Story: అమ్మ ఉండుంటే చాలా సంతోషించేది.. శ్రీగౌరీ ప్రియ కంటతడి | Sri Gouri Priya Gets Emotional At Chennai Love Story Movie Success Meet. Here Are The Photos - Filmibeat Telugu
/photos/feature/sri-gouri-priya-gets-emotional-at-chennai-love-story-movie-success-meet-here-are-the-photos-fb109250.html#photos-4
నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. ఈ జర్నీ మొదలైంది సాయి రాజేష్‌తో, మేమిద్దరం భిన్న ధ్రువాలం.. మా ఇద్దరికి సినిమా అంటే పిచ్చి, దాని కోసం ఎంత కష్టమైనా పడతాం. మంచి సినిమా తీయడానికి ఇల్లు అమ్మేయడమే కాదు.. ప్రాణం పెట్టయినా చేస్తాం. సినిమా అనే పిచ్చి మా ఇద్దరిదీ కలుపుతోంది. ఆయన కథ చెప్పగానే వెంటనే చేద్దామని ఫిక్స్ అయ్యాం. బేబీ సినిమా మా బాధ్యతల్ని పెంచింది, ఏ సినిమా తీసినా సరే అందరికీ నచ్చాలని అనుకున్నాం. కథపరంగా సాయి రాజేశ్‌కి ఫస్ట్ హ్యాట్రిక్ ఆయనదే.. ఇప్పటికే రెండు నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.. దీనికి ఎన్ని అవార్డులు వస్తాయో నాకు తెలియదని ఎస్కేఎన్ తెలిపారు.
6/6
Chennai Love Story: అమ్మ ఉండుంటే చాలా సంతోషించేది.. శ్రీగౌరీ ప్రియ కంటతడి | Sri Gouri Priya Gets Emotional At Chennai Love Story Movie Success Meet. Here Are The Photos - Filmibeat Telugu
/photos/feature/sri-gouri-priya-gets-emotional-at-chennai-love-story-movie-success-meet-here-are-the-photos-fb109250.html#photos-5
మరో నిర్మాత సాయి రాజేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఈ సినిమా మాది అనుకుని పనిచేశారు. అనుకున్న టైంకి సినిమా రావాలనే ఉద్దేశంతో మణిశర్మ గారి టీమ్ కూడా రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశారు. రవికి అన్ని విషయాల్లోనూ అండగా నిలబడ్డా. ఎస్కేఎన్ - సాయి రాజేష్‌లు మంచి కథ రాయగలరు, మంచి సినిమా తీయగలరు అని నిరూపించాలని అనుకున్నాం. మధ్యలో చాలా ఇష్యూస్ వచ్చాయి. ఎస్‌కేఎన్‌కు, నాకు అస్సలు సింక్ అవ్వదు.. కానీ ఇన్నేళ్లుగా ట్రావెల్ అవుతున్నామంటే రీజన్ ఒకటే సినిమా. డబ్బులు ఎంత వస్తే అంత సినిమా మీద పెట్టేస్తాడు.. ముందు హిట్ కావాలనే ఎస్‌కేఎన్ మైండ్‌లో ఉంటుంది అని సాయి రాజేష్ పేర్కొన్నారు.