bredcrumb

సాలె గూడులో చిక్కుకున్న పాలరాతి శిల్పం.. వెరైటీ డ్రెస్‌లో తమన్నా సొగసులు!

By Siva Kodati
| Published: Thursday, November 20, 2025, 20:56 [IST]

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్‌లో ఆమె జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది.

Tamannaah Bhatia Photos
1/5

సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు కావొస్తున్నా నేటీకి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు తమన్నా భాటియా. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మోస్ట్ డిమాండ్ ఉన్న నటీమణుల్లో తమన్నా ముందు వరుసలో ఉన్నారు. ఆమె కాల్షీట్ల కోసం తీవ్రంగా వెయిట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు

Tamannaah Bhatia Photos
2/5

15 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టి నాటి నుంచి విరామం లేకుండా నటిస్తూనే ఉన్నారు తమన్నా భాటియా. శ్రీ అనే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన మిల్కీబ్యూటీకి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్‌ బ్రేక్ ఇచ్చింది.

Tamannaah Bhatia Photos
3/5

ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించి తిరుగులేని నటిగా నిలిచారు తమన్నా.

Tamannaah Bhatia Photos
4/5

హీరోయిన్‌గానే కాకుండా ఐటెం నెంబర్ల ద్వారా తన క్రేజ్‌ను మరింత పెంచుకోవడంతో పాటు పలువురు హీరోయిన్లకు కొత్త దారి చూపించారు. స్పెషల్ సాంగ్స్‌ ద్వారా ఆమె క్రేజ్ మరింత పెరగడంతో పాటు సినిమాలు ఘన విజయం సాధించడానికి కూడా కారణమవుతున్నాయి. జైలర్, స్త్రీ 2, రైడ్ 2 సినిమాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌కు మంచి గుర్తింపు లభించింది.

Tamannaah Bhatia Photos
5/5

ప్రస్తుతం ఓ రోమియో, రేంజర్, రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ సినిమా, వీ వ్యాన్ సినిమాలలో తమన్నా భాటియా నటిస్తున్నారు. అయితే తెలుగులో మాత్రం ఆవిడ సినిమా చేస్తుందా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చివరిసారిగా ఓదెల 2లో కనిపించిన మిల్కీబ్యూటీ.. టాలీవుడ్‌లో కొత్త సినిమాకు కమిట్ కాలేదు.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+