bredcrumb

అలా చిల్ అవుతోన్న రష్మిక మందన్న... అజంతా శిల్పంలా ఫోజులు!

By Siva Kodati
| Published: Sunday, November 16, 2025, 20:19 [IST]

నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.

Rashmika Mandanna Photos
1/5

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ లక్కీయెస్ట్ ఎవరంటే టక్కున వినిపించే పేరు నేషనల్ క్రష్  రష్మిక మందన్నయే. ఆమె ఏది పట్టుకుంటే అది బంగారంగా మారుతోంది. రష్మిక నటించే ప్రతి సినిమా వందల కోట్ల బిజినెస్ చేస్తూ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతోంది.

Rashmika Mandanna Photos
2/5

యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర, థామాలతో వరుస హిట్స్‌ని తన ఖాతాలో వేసుకుని బాలీవుడ్ టాప్ హీరోయిన్లకు కూడా అందని రికార్డులను నెలకొల్పుతున్నారు. ఆమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో తనలోని విలక్షణ నటిని మరోసారి పరిచయం చేశారు రష్మిక. 

Rashmika Mandanna Photos
3/5

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో గత కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న రష్మిక మందన్న .. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కానీ ఇద్దరూ సీక్రెట్‌గా వెకేషన్స్, పార్టీలు, ఇతర శుభకార్యాలలో పాల్గొంటూ మీడియాకు దొరికిపోతున్నారు. అయితే ఇటీవల వీరిద్దరూ సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ జరిగినట్లుగా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ వీరిద్దరూ దీనిని  అధికారికంగా ప్రకటించలేదు. 

Rashmika Mandanna Photos
4/5

ఇటీవలే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ సక్సెస్‌మీట్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా రష్మిక చేతిని ముద్దాడారు విజయ్. రష్మిక ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని తన  ప్రియురాలిని ప్రశంసించారు. 

Rashmika Mandanna Photos
5/5

విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల పెళ్లి ఎప్పుడు? డెస్టినేషన్ వెడ్డింగా? అనే గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ప్యాలెస్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందట. దీనిపై త్వరలోనే  క్లారిటీ రానుంది. 

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+