bredcrumb

The Raja Saab: రాజాసాబ్ బ్యూటీ రిద్ధి కుమార్.. మోడ్రన్ డ్రెస్ లో ఎంత క్యూట్ గా ఉందో కదా..

By Rajesh Karampoori
| Published: Saturday, January 3, 2026, 22:22 [IST]

Riddhi Kumar: టాలెంటెడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా ద్వారా రిద్ధి కుమార్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఆమె వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సినిమా రిలీజ్‌కు ముందే ఆమె పేరు ఈ స్థాయిలో వైరల్ అవుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. లెటేస్ట్ ఫోటోలు వైరలవుతుంది. మీరు కూడా ఓ లూక్కేయండి.   

Riddhi Kumar latest photos
1/6

‘ల‌వ‌ర్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది కేరళ ముద్దుగుమ్మ రిద్దికుమార్‌  (Riddhi Kumar). రాజ్ తరుణ్ సరసన హీరోయిన్‌గా నటించి అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెబ్ ప్రాజెక్ట్స్‌తో పాటు కొన్ని విరామాల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించింది.

Riddhi Kumar latest photos
2/6

ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ (Radhe Shyam) సినిమాలో ఆమె చిన్న కానీ గుర్తుండిపోయే పాత్రలో మెరిసింది. అర్చరీ ప్లేయర్‌గా కనిపించినా, పాత్రకు పరిమిత స్క్రీన్ టైమ్ మాత్రమే లభించింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు ఆశించిన స్థాయిలో రాకపోవడం ఆమె కెరీర్‌పై ప్రభావం చూపింది.

Riddhi Kumar latest photos
3/6

కెరీర్ ప్రారంభ దశలో గ్లామర్ రోల్స్‌కి అంతగా ఆసక్తి చూపించకపోవడం వల్లే అవకాశాలు తగ్గాయని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వరుస ఫోటోషూట్స్‌తో గ్లామర్ ట్రీట్ ఇస్తూ, సోషల్ మీడియాలో తన ప్రెజెన్స్‌ను బలంగా చూపిస్తోంది. ఇదే సమయంలో మలయాళంలో కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి.

Riddhi Kumar latest photos
4/6

పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) నటిస్తున్న ది రాజా సాబ్ (The Raja Saab) సినిమాతో రిద్ధి కుమార్ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆమె వన్ ఆఫ్ ది హీరోయిన్‌గా కీలక పాత్రలో కనిపించనుంది. సినిమా విడుదలకు ముందే ఆమె పేరు సోషల్ మీడియాలో ఈ స్థాయిలో వైరల్ అవుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు.

Riddhi Kumar latest photos
5/6

సోషల్ మీడియా ఫేమ్‌తో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లేటెస్ట్ బ్యూటీ రిద్ది కుమార్. తాజాగా ఆమె వైట్ ఫ్రాక్‌లో చేసిన ఫోటోషూట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. సింపుల్ లుక్ అయినా, గ్రేస్‌ఫుల్ ప్రెజెన్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో నిలిచింది.

Riddhi Kumar latest photos
6/6

ప్రస్తుతం రిద్ధి కుమార్ ‘రాజాసాబ్’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ సినిమా హిట్ అయితే, ఆమె కెరీర్ పూర్తిగా మరో లెవెల్‌కు వెళ్లడం ఖాయమనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కమర్షియల్ ప్రాజెక్టులు ఆమెను వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+