Don't Miss!
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Sports
భారత్ మా బౌలింగ్ వ్యూహాలను కాపీ కొట్టింది: రమీజ్ రాజా
- Finance
రాష్ట్రాలకు ధీటుగా మున్సిపల్ కార్పొరేషన్ షాకింగ్ బడ్జెట్.. 134 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Ustad Bhagat Singh: అసలు పని మొదలైంది.. వాళ్ళతో డైరెక్టర్ బిగ్ ప్లాన్.. ఫొటో వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న ఈ సినిమాకు ఉస్తాద్ భగత్ సింగ్ అనే కొత్త టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఇంతకుముందు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ తో ఒక న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి మళ్లీ ఆ తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇక మొత్తానికి దర్శకుడు ఆ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని ఫిక్స్ అయ్యాడు.
ఈ సినిమా తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న థెరి కథకు రీమేక్ అని కూడా ఒక టాక్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో ఇంతవరకు చిత్ర యూనిట్ సభ్యులు ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ తప్పకుండా ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని హరీష్ శంకర్ ఇంతకుముందే ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ సెట్ అయింది కాబట్టి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినట్లు కూడా చెబుతున్నారు.

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. ఇక లేటెస్ట్ గా దర్శకుడు ఆర్ట్ డైరెక్టర్ తో చర్చలు కొనసాగిస్తున్న ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నయని ఇక త్వరలోనే ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి వర్క్ తో మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్లుగా కూడా చెప్పేశారు.
Pre-production of #UstaadBhagatSingh in full swing with director @harish2you and art director #AnandSai conceptualizing something huge 💥
— Mythri Movie Makers (@MythriOfficial) December 29, 2022
Shoot begins soon.@PawanKalyan @ThisIsDSP @DoP_Bose @UBSTheFilm pic.twitter.com/EEZzjVlMN9
దర్శకుడు హరిష్ శంకర్ 2019లో గద్దల కొండ గణేష్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ అతను మరో సినిమాను వెంటనే తెరపైకి తీసుకురావాలని అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా అతని కాంబినేషన్స్ అన్ని కూడా క్యాన్సిల్ అవుతూ వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి భవిష్యత్తులో విజయ్ దేవరకొండ తో కూడా అతను ఒక సినిమా చేయాలి అని చర్చలు జరుపుతున్నాడు. మరి ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులకు క్రియేట్ చేస్తాడో చూడాలి.