X
తెలుగు » సినిమాలు » డి జె టిల్లు
డి జె టిల్లు

డి జె టిల్లు

Romance | Thriller | 12 Feb 2022 | 124 Mins
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

డి జె టిల్లు స్టోరీ

డి జె టిల్లు సినిమా రొమాంటిక్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగత్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విమల్ కృష్ణ అందించారు. నిర్మాత నాగ వంశి నిర్మించారు. సంగీతం శ్రీచరణ్ పాకాల అందించారు.  కథ బాల గంగాధర్ తిలక్ అలియాస్ డీజే టిల్లు తన మనసుకు నచ్చే పనిచేసే ఆధునిక పోకడలను అనుసరించే యువకుడు. మ్యూజిక్ అంటే పడిచచ్చే టిల్లు పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలలో డీజే వాయిస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. దిల్ కుష్‌గా లైఫ్‌ను లీడ్ చేసే టిల్లుకు రాధిక (నేహా శెట్టి) అనే సింగర్ పరిచయం అవుతుంది. ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. రాధిక కారణంగా ఓ హత్య కేసులో చేతికి బురద అంటించుకొంటాడు. మ్యూజిక్‌ను ఇష్టపడే డీజే టిల్లు అసలు లక్ష్యం ఏమిటి? రాధికతో పరిచయం తర్వాత ఎలాంటి పరిస్థితులను, సమస్యలను ఎదుర్కొంటాడు? రాధిక కారణంగా ఎందుకు హత్యకేసులో ఇరుక్కొంటాడు? ఈ కథలో ప్రిన్స్ సిసిల్, పోలీస్ ఆఫీసర్ (బ్రహ్మానందం), నర్రా శ్రీను పాత్రలకు రాధిక కు కనెక్షన్ ఏమిటి? చివరకు డీజే టిల్లు ఎలా ఈ కేసును బయటపడ్డాడు? చివరకు రాధిక, టిల్లు రిలేషన్‌షిప్‌కు ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే డీజే టిల్లు సినిమా కథ.
Read More

డి జె టిల్లు కాస్ట్ & క్రూ

డి జె టిల్లు సిబ్బంది సమాచారం

దర్శకత్వం విమల్ కృష్ణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు నవీన్ నూలి
సంగీతం శ్రీచరణ్ పాకాల, తమన్ యస్, రామ్ మిరియాల
నిర్మాత నాగ వంశీ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డి జె టిల్లు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
డీజే టిల్లు సినిమా పూర్తిగా నాన్ స్టాప్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఆధారంగా సాగే ఫుల్టు, బిందాస్ సినిమా. సిద్దూ జొన్నలగడ్డ మల్టీ టాస్కింగ్ వర్క్, యాటిట్యూడ్, డ్రెసింగ్, లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. విమల్ డైరెక్షన్‌లో వెండితెర మీద ఏకపాత్రాభినయం చేశాడంటే అతిశయోక్తి కాదేమో. ఒక కనురెప్ప కొడితే పంచ్ డైలాగ్స్, ఫన్ మిస్ అయిపోతామనే అంత పర్‌ఫెక్ట్‌గా సీన్లు ఉంటాయి. టికెట్‌కు పెట్టిన ప్రతీ రూపాయి డబుల్ పైసా వసూల్. ఇటీవల కాలంలో వచ్చిన ఏకదమ్ పవర్ ప్యాక్డ్ కామెడీ ఎంటర్‌టైనర్. రానున్న రోజుల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసే సత్తా ఉన్న సినిమాగా మారే అవకాశం డీజే టిల్లుకు ఉన్నాయని చెప్పవచ్చు.

డి జె టిల్లు ట్రైలర్

Video Thumbnail

డి జె టిల్లు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

డి జె టిల్లు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+