X
తెలుగు » సినిమాలు » రైటర్ పద్మభూషణ్
రైటర్ పద్మభూషణ్

రైటర్ పద్మభూషణ్

Romance | 03 Feb 2023 | U | 123 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

రైటర్ పద్మభూషణ్ స్టోరీ

రైటర్ పద్మభూషణ్ మూవీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుహాస్, టీనా శిల్పరాజ్‌, రోహిణి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం షణ్ముఖ్‌ ప్రశాంత్‌ వహించారు. నిర్మాతలు  చంద్రు మనోహర్, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు. సంగీతం శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ కలిసి  అందించారు.  కథ ఎప్పటికైనా గొప్ప రైటర్ కావాలని కలలుకనే పద్మభూషణ్ లైబ్రరీలో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటాడు. చివరకు కష్టపడి తొలి అడుగు అనే పుస్తకాన్ని రాసి.. నాలుగు లక్షలు అప్పు చేసి ప్రింట్ చేయిస్తాడు. అయితే ఆ పుస్తకానికి ఎలాంటి స్పందన లభించదు. దాంతో కష్టపడి ఆ పుస్తకాన్ని అమ్మించాలని, చదివించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. అలంటి సమయంలోనే మార్కెట్‌లోకి తన పేరు తో ఓ పుస్తకం రావడం, పాపులారిటీ లభించడం జరిగిపోతుంటుంది. ఆ క్రమంలో తన పేరుతో ప్రింట్ అయిన పుస్తకాన్ని చదివిన మామ (గోపరాజు రమణ) తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకొంటారు. వేరే వ్యక్తి రాసిన పుస్తకాన్ని తాను రాసినట్టు ఫీలయ్యే పద్మభూషణ్.. తన కాబోయే భార్యకు, మామకు అసలు విషయం చెప్పాలని అనుకొంటాడు. ఓ పుస్తకాన్ని రాయడానికి పద్మభూషణ్ ఎలాంటి కష్టాలు పడ్డాడు? తొలి అడుగు పుస్తకాన్ని మార్కెట్ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? అప్పు చేసిన పాపానికి ఎలాంటి సమస్యలు అనుభవించాడు. రైటర్ పద్మభూషణ్ పేరుతో పుస్తకం రాసిన వ్యక్తి ఎవరు? తన పేరుతో పుస్తకం రాసిన వ్యక్తిని పద్మభూషణ్ కనుకొన్నాడా? తాను రచయితను కాదని కాబోయే భార్య సారిక (టీనా)కు చెప్పాడా? కన్నాంబ (శ్రీ గౌరీ ప్రియ) ఎవరు? పద్మభూషణ్‌కు కన్నాంబకు ఎలాంటి సంబంధం ఉంది అనే ప్రశ్నలకు సమాధానమే రైటర్ పద్మభూషణ్ సినిమా కథ. ఇంట్లోని ఆడవారికి ఇష్టాలను, అభిరుచులను గౌరవించాలి అనే కోణంలో దర్శకుడు షణ్ముక్ ప్రశాంత్ ఈ సినిమాలో అద్భుతమైన ఎమోషన్ తో పాటు గుడ్ ఫన్ ను కూడా చక్కగా చూపించాడు. పద్మభూషణ్‌గా పలు వేరియేషన్స్ ఉన్న పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు. కథ, కథనాలు రొటీన్‌గా ఉన్నా సుహాస్ తన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాను తన భుజాలపై మోసిన తీరు బాగుంది. నటనపరంగా ప్రతీ సినిమాకు తన ప్రతిభను మెరుగుపరుచుకొంటూ వెళ్లడం బాగుంది. నటుడిగా మరో మెట్టు ఎక్కరాని చెప్పవచ్చు. గోపరాజు ఆశిష్ విద్యార్థి, రోహిణి, టీనా, శ్రీగౌరి ప్రియ, ప్రవీణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.
Read More

రైటర్ పద్మభూషణ్ కాస్ట్ & క్రూ

రైటర్ పద్మభూషణ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం షణ్ముఖ్‌ ప్రశాంత్‌
స్టోరీ షణ్ముఖ్‌ ప్రశాంత్‌
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్
నిర్మాత చంద్రు మనోహరన్, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రైటర్ పద్మభూషణ్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఉన్నత స్థాయికి ఎదుగాలనుకొనే మిడిల్ క్లాస్ కుర్రాడి జీవితం, లవ్, ఎమోషన్స్ కూడిన చిత్రం రైటర్ పద్మభూషణ్. ఈ సినిమాకు మదర్ సెంటిమెంట్ ప్రాణంగా నిలిచింది. మధ్య తరగతి కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాలు సినిమాకు బలంగా నిలిచాయి. దర్శకుడు రాసుకొన్న స్క్రిప్టు, నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సిన్ వరకు గుండెను పిండేసే అంశాలు, సెంటిమెంట్ ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విభిన్నమైన సినిమాలను ఆదరించే వారికి, ఇష్టపడే వారికి రైటర్ పద్మభూషణ్ తప్పకుండా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే.. మంచి అనుభూతిని పొందుతారు. వారాంతంలో మంచి సినిమాను చూడాలనే వారికి ఈ చిత్రం కేరాఫ్ అడ్రస్.

రైటర్ పద్మభూషణ్ ట్రైలర్

Video Thumbnail

రైటర్ పద్మభూషణ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రైటర్ పద్మభూషణ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+