X
Home టాప్ లిస్టింగ్

2023 టాప్ హిట్ తెలుగు మూవీస్

Author Administrator | Published: Friday, August 4, 2023, 10:47 AM [IST]

2023 ఏడాది ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ ‘ఆదిపురుష్’ బ్రో వంటి మూడు పెద్ద సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ సక్సెస్ రేట్ బాగానే నమోదైనట్టు స్పష్టమవుతుంది. మరి 7 నెలల్లో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.


cover image
వాల్తేరు వీరయ్య

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన చిత్రం వాల్తేరు వీర‌య్య‌. ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైంది. డైరెక్ట‌ర్ బాబీ చిరంజీవిని చూపించిన తీరు.. ఆయ‌న డాన్సుల‌కు ఫ్యాన్స్, ప్రేక్ష‌కుల‌కు ఫిదా అయ్యారు. ఏకంగా రూ.235 కోట్ల మేర‌కు క‌లెక్ష‌న్స్‌ను సినిమా సాధించింది. ఇందులో చిరంజీవి త‌మ్ముడు పాత్ర‌లో ర‌వితేజ న‌టించ‌టం విశేషం. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. 

వీర సింహా రెడ్డి

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించిన సినిమా ఇది. ఇది కూడా సంక్రాంతి బ‌రిలోకే దిగింది. వంద కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్  సాధించింది. అఖండ త‌ర్వాత బాల‌య్య‌కు మ‌రో హిట్ వ‌చ్చింది. ఇందులో బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యం చేశారు. శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌. 

రైటర్ పద్మభూషణ్

సుహాస్ హీరోగా న‌టించిన రైట‌ర్ ప‌ద్మ‌భూష‌ణ్‌.. ఫిబ్ర‌వ‌రి 3న రిలీజైంది. ష‌ణ్ముక్ ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కింది. ఇందులో ఇంట్లో మ‌హిళ‌ల‌కు కెరీర్‌లో ఏదో సాధించాల‌నే త‌ప‌న ఉంటుంది. వారిని ఎంక‌రేజ్ చేయాల‌నే పాయింట్‌తో తెర‌కెక్కింది. త‌క్కువ బ‌డ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ హిట్‌ను అందుకుంది.

సార్

గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్స్‌పై ప్రైవేట్ స్కూల్స్ ఆధిప‌త్యం చెలాయించిన ఓ ద‌శ‌కం నాటి ప‌రిస్థితుల‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమా సార్‌. తెలుగు నిర్మాత‌లు సూర్య‌దేవ‌ర నాగవంశీ, సాయి సౌజ‌న్య‌ల‌తో పాటు డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి కూడా తెలుగువాడే కావ‌టం విశేషం. ధ‌నుష్ న‌టించిన తొలి తెలుగు సినిమా ఇది. హీరోకున్న క్రేజ్‌, మార్కెట్‌ను బ‌ట్టి చూస్తే సార్‌కు వ‌చ్చిన క‌లెక్షన్స్ ప‌రంగా..ఇది త‌మిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్ అయ్యింద‌నాలి.

 

బలగం

క‌మెడియ‌న్ వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం బ‌ల‌గం. తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌పై తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. దిల్ రాజు పెట్టిన బ‌డ్జెట్‌కు మూడు నాలుగింత‌లు క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయ‌నే చెప్పాలి. ప‌ల్లెటూరులోని జ‌నాలంద‌రూ బ‌ళ్లు క‌ట్టుకుని వ‌చ్చి మ‌రీ సినిమాను చూశారు. అలాగే చాలా ఊళ్లలో తెర‌లు ఏర్పాటు చేసుకుని కూడా సినిమాను చూశారు. 

దసరా

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ ద‌స‌రా. వంద కోట్ల మేర‌కు క‌లెక్ష‌న్స్‌ సాధించింది. నాని కెరీర్‌లో వ‌న్ ఆఫ్ బిగ్గెస్ట్ హిట్‌. ర‌గ్డ్ లుక్‌లో నాని, కీర్తి సురేష్‌ల న‌ట‌న మెప్పించింది. డెబ్యూ డైరెక్ట‌రే అయినా శ్రీకాంత్ ఓదెల సినిమాను తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సూప‌ర్బ్‌గా తెర‌కెక్కించటం, పాట‌లు అన్నీ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్యి సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. 

విరూపాక్ష

యాక్సిడెంట్ త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన చిత్రం విరూపాక్ష‌. కార్తీక్ దండు తెర‌కెక్కించిన మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్. ఎవ‌రూ ఊహించ‌ని రేంజ్‌లో బ్లాక్ బ‌స్టర్ స‌క్సెస్‌ను సాధించింది. ఏకంగా వంద కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి సాయి ధ‌ర‌మ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఇది నిలిచింది. ఇందులో సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌. 

సామజ వరగమన

చిన్న సినిమాగా జూన్‌ 29న విడుదలైన ‘సామజవరగమన సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలకు ముందు కేవలం మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. తర్వాత సినిమాపై పాజిటివ్‌ టాక్‌ రావడంతో దాని బిజినెస్‌ లెక్కలు మారిపోయాయి. కేవలం రూ. 7కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 50 కోట్లకు పైగానే రాబట్టింది.

బేబీ

ప్రస్తుత పరిస్థితులకు తగ్గ సినిమాలు వస్తే వాటికి ఎలాంటి స్పందన వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ యూత్‌కు కనెక్ట్ అయ్యే కాంటెంపరరీ లవ్ స్టోరీలతో తెరకెక్కే మూవీలకు మరింత ఎక్కువ రెస్పాన్స్ దక్కుతోంది. ఇప్పుడు దీన్ని మరోసారి నిరూపిస్తూ సూపర్ సక్సెస్ అయిన సినిమానే 'బేబి'. సందేశాత్మక అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆరంభం నుంచీ అదిరిపోయే వసూళ్లు వస్తున్నాయి. ఇలా మూడు వారాల్లోనూ ఇది కలెక్షన్ల సునామీని సృష్టించి ఎన్నో రికార్డులను నమోదు చేసింది.

బ్రో

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రో. తమిళంలో సముద్రఖని, తంబిరామయ్య ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు పలు మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఓ రేంజ్‌లో బ్లాక్ బ‌స్టర్ స‌క్సెస్‌ను సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+