twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ మీద భీమవరంలో పోటీ... వర్మ మాటలు నమ్మినవారంతా ఫూల్స్!

    |

    వివాదాలకు కేంద్ర బింధువుగా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్నికల వేళ ఆసక్తికర ప్రకటన చేశారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద కంటెస్ట్ చేస్తాను అంటూ గురువారం అర్దరాత్రి ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే.

    నామినేషన్ల గడువు ముగిసిందని నాకూ తెలుసు. కానీ నాకు పై నుంచి స్పెషల్ పర్మీషన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ మీద కంటెస్ట్ చేయబోతున్నాను. పూర్తి వివరాల కోసం వెయిట్ చేయండి అంటూ వర్మ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

    రామ్ గోపాల్ వర్మ ప్రకటన ఎఫెక్ట్

    రామ్ గోపాల్ వర్మ ప్రకటన ఎఫెక్ట్

    వర్మ ఈ ప్రకటన చేయగానే... నామినేషన్లు ముగిసిన తర్వాత ఇది ఎలా సాధ్యం అంటూ కొందరు ఆలోచనలో పడిపోతే.... వోడ్కా మత్తు ఎక్కువయి వర్మ ఇదంతా వాగుతున్నాడంటూ మరికొందరు విమర్శలు చేయడం ప్రారంభించారు.

    వర్మ మాటలు నమ్మినవారంతా ఫూల్స్

    అయితే రామ్ గోపాల్ వర్మ మాటలు నమ్మినవారంతా ఫూల్సే. తన ట్వీట్ మీద వర్మ స్పందిస్తూ... ‘ఇది అడ్వాన్స్ ఏప్రిల్ ఫూల్ జోక్. నేను చెప్పిన స్టుపిడ్ మాటలు ఎవరూ నమ్మి ఉండరు అని భావిస్తున్నాను' అంటూ షాకిచ్చాడు.

    భీమవరంలో పవన్ కళ్యాణ్‌పై కంటెస్ట్ చేస్తా: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన!భీమవరంలో పవన్ కళ్యాణ్‌పై కంటెస్ట్ చేస్తా: రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన!

    ఫ్యాన్స్ రియాక్షన్

    ఫ్యాన్స్ రియాక్షన్

    ‘‘నీ మాటలు ఎవరూ నమ్మలేదు. నువ్వు వోడ్కా మత్తులో ఆ కామెంట్స్ చేశావని మాకు తెలుసు. ఏప్రిల్ ఫూల్ అయింది మేము కాదు... నువ్వే. నీ పోస్టు కింద కామెంట్స్ చదివితే విషయం మీకు అర్థమవుతుంది'' అంటూ అభిమానులు పంచులు వేయడం ప్రారంభించారు.

    ఫన్నీ మీమ్స్

    మరికొందరు నెటిజన్లు.... ఫన్నీ మీమ్స్ పోస్ట్ చేస్తూ వర్మకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అఫ్ కోర్స్ వర్మకు ఇలా నెటిజన్లతో తిట్టించుకోవడం కొత్తేమీ కాదనుకోండి. ఆయన ఇవేమీ పట్టించుకోకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ప్రమోషన్లో మునిగిపోయారు.

    English summary
    ‘‘I am contesting against Pawan Kalyan in Bhimavaram’’ This is just an advance April Fool Joke ..I hope no one was stupid enough to believe it... RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X