twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ చిన్న ఆఫీస్ నేడు యశ్ రాజ్ ఫిల్మ్స్.. ఆదిత్య చోప్రా ఎమోషనల్

    |

    భారత సినీ పరిశ్రమలో యశ్ రాజ్ ఫిల్మ్స్ (YRF) చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన ఘనత వైఆర్‌ఎఫ్‌కు ఉంది. ఈ సంస్థను ప్రారంభించి యాభై ఏళ్లు అవుతున్న సందర్భంగా యశ్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా ఎమోషనల్ అయ్యాడు. వైఆర్‌ఎఫ్ పుట్టుక, దాని ఎదుగుదల ఎలా జరిగిందో వివరిస్తూ ఓ లేఖ విడుదల చేశాడు. పైగా నేడు యశ్ చోప్రా జయంతి కావడంతో అందులో ఎన్నో విషయాలను వెల్లడించాడు ఆదిత్య చోప్రా.

    '1970లో మా నాన్న యశ్ చోప్రా ఆయన సోదరుడి వద్ద ఉద్యోగాని వదిలి కొంత కంపెనీని ప్రారంభించారు. అప్పటి వరకు ఆయనకు బీఆర్ కంపెనీ ఉద్యోగికి జీతమందేది ఆయకంటూ సొంతంగా ఏమీ లేదు. ఆయన వ్యాపారం ఎలా నడపాలో కూడా తెలీదు.. కంపెనీ ప్రారంభించాలంటే ఏం చేయాలో కూడా తెలియదు. కానీ ఆయనకు తన ప్రతిభపై, కష్టపడే మనస్తత్వంపై ప్రగాఢ విశ్వాసం ఉండేది. అలాంటి ఆయన కేవలం అతనిలోని కళను నమ్ముకున్నాడు. అక్కడి నుంచే యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రారంభమైంది.

    Aditya Chopra Emotional On Completing 50 Years Of YRF

    రాజ్‌కమల్ స్డూడియోస్ అధినేత శాంతారాం ఓ చిన్న రూంలో మా నాన్నకు చోటిచ్చారు. ఆ స్టూడియోలోనే ఓ చిన్న రూంలో ఆఫీస్‌ను పెట్టారు. అయితే ఆ రోజు అలా ఆయన ఓ చిన్న రూంలో పెట్టిన ఆ చిన్న కంపెనీ ఇండియాలోనే అతిపెద్ద ప్రొడక్షన్ కంపెనీగా మారుతుందని మా నాన్నకు తెలిసి ఉండకపోవచ్చు.. 1995లో యష్ రాజ్ ఫిల్మ్మ్ 25 వసంతంలోకి ఎంటరైంది. దర్శకుడిగా నా తొలి చిత్రం దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే రిలీజైంది.

    అది అలా సెన్సేషనల్ హిట్ అవ్వడంతో నాకు కూడా నమ్మకం కలిగింది. నా ఆలోచనలకు, ఊహలకు రెక్కలొచ్చి.. వైఆర్‌ఎఫ్ భవిష్యత్ కోసం ప్రయోగాలు చేయోచ్చన్న విశ్వాసం కలిగింది. నేను ఆయన కొడుకుగా కంటే.. నా ఆలోచనలు, ఐడియాలపైనే ఎక్కువ నమ్మకం ఉండేది. నా సినిమాలు సక్సెస్ అవ్వడంతో నా ఐడియాలపై ఇంకా నమ్మకం పెరిగింది' అంటూ వైఆర్‌ఎఫ్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ఎంతగా శ్రమించాడో ఆదిత్య చోప్రా వివరించాడు.

    English summary
    Aditya Chopra Emotional On Completing 50 Years Of YRF, Aditya Chopra say that In 1970, my father Yash Chopra, left the security and comfort of his brother Mr. BR Chopra and formed his own company. Till then, he was a salaried employee of BR Films and didn't own anything of his own.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X