అంబానీ కుమారుడి ఎంజేగ్మెంట్ పార్టీ: ఐశ్వర్యతో పాటు తరలి వచ్చిన తారాలోకం.... (ఫోటోస్)
Recommended Video

భారత దేశ కుభేరుడు, లక్షల కోట్ల రిలయన్స్ సామ్రాజ్యానికి అధిపతి ముఖేష్ అంబానీ దంపతుల కుమారుడు ఆకాష్ అంబానీ ఎంగేజ్మెంట్ వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో ఇటీవల గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ముంబైలో సెలబ్రిటీల కోసం ఎంగేజ్మెంట్ బాష్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, షారుక్ ఖాన్, కరణ్ జోహార్, జాన్ అబ్రహం, కిరణ్ రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా చిన్ననాటి నుండి స్నేహితులు. ధీరుభాయ్ అంబానీ ఇంర్నేషనల్ స్కూల్‌లో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఈ నెల 24న గోవాలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది.

కొత్త జంటతో కలిసి షారుక్ ఖాన్
కొత్త జంట ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్.

కూతురు ఆరాధ్యతో కలిసి ఐష్
తన భర్త అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం మన్మర్జియా షూటింగులో భాగంగా ఔట్ స్టేషన్లో ఉండటంతో తన కూతురు ఆరాధ్యతో కలిసి అంబానీ ఇంట జరిగిన ఎంగేజ్మెంట్ పార్టీకి హాజరయ్యారు ఐశ్వర్యరాయ్.

ఎంత క్యూట్‌గా ఉందో...
ఆరాధ్య బచ్చన్ తన క్యూట్ లుక్‌తో ఈ వేడుకలో హైలెట్ అయింది. తల్లితో కలిసి ఈ వేడుకలో ఆరాధ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు...

హాట్ బ్యూటీ కూడా..
బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఆకాష్ అంబానీతో కత్రినాకు మంచి ప్రెండ్షిప్ ఉంది.

జాన్ అబ్రహం
అంబానీ కుటుంబానికి సన్నిహితంగా ఉండే బాలీవుడ్ స్టార్లలో జాన్ అబ్రహం కూడా ఒకరు. అంబానీ ఇంట జరిగే ఏ వేడుకకైనా జాన్ అబ్రహం కూడా తప్పక ఆహ్వానం అందుతుంది.

కరణ్ విత్ కిరణ్
ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ వేడుకకు హాజరు కాలేక పోయారు. అయితే ఆయన భార్య కిరణ్ రావు హాజరై అతడు లేని లోటు పూడ్చింది. ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్‌తో కలిసి కిరణ్ రావు ఫోటోకు ఫోజు ఇచ్చిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

జహీర్-సాగరిక
ఇటీవలే కొత్తగా పెళ్లైన బాలీవుడ్ నటి సాగరిక... తన భర్త, క్రికెటర్ జహీర్ ఖాన్‌తో ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరై కొత్త జంటను విష్ చేశారు.

ఆకాష్-శ్లోక
ముంబైలో జరిగిన ఎంగేజ్మెంట్ పార్టీ సందర్బంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆకాష్ అంబానీ, శ్లోక మోహతా.


Click it and Unblock the Notifications











