Don't Miss!
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- News
YS Jagan, Chandrababu : జగన్, చంద్రబాబుకూ సంక్షేమ సవాల్ ! లబ్దిదారుల డిమాండ్లు ఇవే..!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆ డైరెక్టర్‌కు అమ్మాయిల పిచ్చి.. హీరోయిన్లతో చెత్త ప్రవర్తన.. సిగ్గుచేటు.. దియా మిర్జా
ప్రముఖ కోరియోగ్రాఫర్, దర్శకురాలు సోదరుడు, డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడే అవకాశం కనిపించడం లేదు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా సాజిద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 2007లో హే బేబీ సినిమా కోసం సాజిద్ ఖాన్‌తో కలిసి పనిచేసింది. ఆ సందర్భంగా జరిగిన కొన్ని విషయాలను ఆమె మీడియాకు వెల్లడించింది. మహిళలతో సాజిద్ ఖాన్ దురుసుగా ప్రవర్తించే తీరు నాకు ముందు నుంచే తెలుసునని ఆమె అన్నారు. ఇంకా ఏమన్నారంటే..

నన్ను కలిచివేసింది
సాజిద్ ఖాన్‌పై పలువురు లైంగిక దాడి ఆరోపణలు చేయడం నన్ను కలిచివేసింది. అతడికి అమ్మాయిల పిచ్చి, మహిళలతో దారుణంగా ప్రవర్తిస్తాడు. అత్యంత చెత్త ప్రవర్తన కలిగిన వ్యక్తి అని నాకు తెలుసు. కానీ అతడి ప్రవర్తన గురించి పలువురు వెల్లడిస్తుంటే షాక్ గురవుతున్నాను అని దియా మిర్జా వెల్లడించింది.

సాజిద్ ప్రవర్తన గురించి
హే బేబీ షూటింగ్‌లో సాజిద్ ప్రవర్తనను గమనించాను. అందుకే అతడితో ఎలాంటి రిలేషన్ పెట్టుకోలేదు. అతనికి సాధ్యమైనంత దూరంగా ఉన్నాను. సాజిద్ లైంగిక వేధింపుల గురించి చాలా మంది బయటకు రావడం దిగ్బ్రాంతికి గురిచేస్తున్నది అని దియా మిర్జా ఆవేదన వ్యక్తం చేసింది.

సాజిద్ తీరు సిగ్గుచేటు
హీరోయిన్లు, ఔత్సాహిక మహిళా తారలపై సాజిద్ ఇలా చేయడం సిగ్గుచేటు. చాలా మంది నరకయాతనను దిగమింగుకొన్నారు. ఇప్పుడు చెప్పడానికి స్కోప్ ఏర్పడటంతో ధైర్యంగా ముందుకొస్తున్నారు. సాజిద్‌పై రాచెల్ వైట్, సిమ్రాన్ సూరి లాంటి తారలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

నటి బిపాసాబసు ఆరోపణ
హమ్ షకల్ సినిమా షూటింగ్ సమయంలో నాకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యయని బిపాసా బసు వెల్లడించింది. సెట్లో మహిళలతో సాజిద్ ప్రవర్తించే తీరు సరిగా ఉండేది కాదు. అందుకే అతడికి దూరంగా ఉన్నానని బిపాసా బసు పేర్కొన్నది.