»   » ఇల్లు, స్టూడియో అమ్ముకొన్నాం.. ఆ సినిమాతో దారుణంగా నష్టపోయాం.. రిషీ కపూర్

ఇల్లు, స్టూడియో అమ్ముకొన్నాం.. ఆ సినిమాతో దారుణంగా నష్టపోయాం.. రిషీ కపూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారత సినీ దిగ్గజం రాజ్ కపూర్ రూపొందించిన చిత్రాలన్నీ దాదాపు అణిముత్యాలే. ఆయన రూపొందించిన అత్యద్భుత చిత్రం మేరా నామ్ జోకర్. అయితే ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలందుకున్నారు గానీ.. సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది. అయితే ఆ సినిమా తమ కుటుంబానికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందనే విషయాన్ని ఇటీవల రాజ్ కపూర్ కుమారుడు రిషికపూర్ వెల్లడించారు.

ఆ సినిమా రిలీజ్‌కు కష్టాలు

ఆ సినిమా రిలీజ్‌కు కష్టాలు

మేరా నామ్ జోకర్ సినిమాను మా నాన్న రాజ్ కపూర్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దారు. ఆ సినిమాను విడుదల చేయడానికి మా ఆస్తులను అమ్ముకొన్నాం. స్టూడియోను కుదవపెట్టాల్సి వచ్చింది. దాంతో చాలా సమస్యలను ఎదుర్కొన్నాం. మాటల్లో చెప్పలేని బాధను అనుభవించాం అని రాజ్ కపూర్ అన్నారు

మేరా నామ్ జోకర్ ఫ్లాప్ తర్వాత

మేరా నామ్ జోకర్ ఫ్లాప్ తర్వాత

మేరా నామ్ జోకర్ సినిమా ఫ్లాప్ ప్రభావం ఆ తర్వాత రూపొందించిన బాబీ సినిమాపై పడింది. ఆ చిత్రం రిషీకపూర్, డింపుల్ కపాడియా బాలీవుడ్ తెరకు పరిచయం అయ్యారు. బాబీ గురించి వెల్లడిస్తూ.. మేరా నామ్ జోకర్ ఫ్లాప్ తర్వాత కొత్త వాళ్లతో బాబీ సినిమా తీయాలనుకొన్నాడు. ఆ సినిమా కొత్తవాళ్లతో తీయడం అనేక ఇబ్బందులకు దారి తీసింది.

 బాబీ తర్వాత పరిస్థితి

బాబీ తర్వాత పరిస్థితి

అనేక సమస్యలను ఎదుర్కొని బాబీ సినిమా రిలీజైంది. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఒక్కసారి మా పరిస్థితి మారిపోయింది. బాబీ సూపర్ హిట్ కావడంతో మళ్లీ మాపై విశ్వాసం పెరిగిపోయింది. ఆర్థికంగా మేము నిలదొక్కుకున్నాం.

బాబీ హిట్ తర్వాత

బాబీ హిట్ తర్వాత

మేరా నామ్ జోకర్ ఫ్లాప్‌తో దూరమైన బంధువులు, సన్నిహితులు, స్నేహితులు.. బాబీ హిట్ తర్వాత మళ్లీ మా వద్దకు వచ్చారు. మా బాబాయిలు మళ్లీ ఇల్లు కొనుక్కోమని సలహాలివ్వడం ప్రారంభించారు.

 ఆ కష్టాలు గుర్తుకు రావు

ఆ కష్టాలు గుర్తుకు రావు

ఫ్లాప్‌లతో మేమెన్నీ ఇబ్బందులు పడినా గానీ మా నాన్న తీసిన సినిమాల గురించి ఇప్పటి జనరేషన్ మాట్లాడితే ఆ కష్టాలు గుర్తుకు రావు. సినిమాల కారణంగా రాజ్ కపూర్ మన మధ్యనే జీవించారని అనుకొంటూ ఉంటాను.

 కపూర్ సినిమాలకు ఆదరణ

కపూర్ సినిమాలకు ఆదరణ

బుధవారం జరిగిన రాజ్ కపూర్ అవార్డ్స్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యక్రమానికి తన సోదరుడుల రణధీర్ కపూర్, రాజీవ్ కపూర్‌తో కలిసి రిషీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మా నాన్న చనిపోయి 30 ఏళ్లు అయిపోయింది. ఇటీవల నేను జార్జియా, తాష్కెంట్‌లో పర్యటించాను. అక్కడ ఇప్పటికీ కరీనా కపూర్, కరిష్మా కపూర్, రణ్‌బీర్ కపూర్ సినిమాలను ఆదరిస్తారు.

 ఇంకా జీవించే ఉన్నాడు..

ఇంకా జీవించే ఉన్నాడు..

ఇంకా ఆయా దేశాల ఈ తరం ప్రేక్షకులు రాజ్ కపూర్ సినిమాల గురించి మాట్లాడుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికీ రాజ్ కపూర్ ఇంకా ప్రేక్షకుల మదిలో జీవించి ఉన్నాడంటే ఆయన తీసిన గొప్ప సినిమాలే కారణం అని రిషీ కపూర్ భావోద్వేగాని లోనయ్యారు.

English summary
Talking about Raj Kapoor’s passion for making films, Rishi shared an anecdote. He said: “When Mera Naam Joker was about to release, our studio and all our assets were mortgaged to release that film, and the picture bombed. We were in severe problems. Then he made a film called Bobby with new boy and new girl, which was a huge risk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu