twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా జీవితాన్ని నరకంగా మార్చాడు.. అలా దారుణంగా వాడుకొని.. జాక్వలైన్ ఫెర్నాండేజ్

    |

    బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్ భోరుమని విలపించినంత పనిచేసింది. కరుడు గట్టిన ఆర్థిక నేరస్థుడు సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసు విచారణలో పలు ఆరోపణలపై ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ తన ప్రొఫెషనల్ జీవితానికి ఇబ్బందిగా మారింది. విదేశాలకు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో నా కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి నాకు ఈ కేసులో దేశం విడిచి వెళ్లేందుకు మినహాయింపు ఇవ్వాలని ఢిల్లీలోని పాటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో కోర్టు వాదనల సమయంలో జాక్వలైన్ వేడుకొన్నది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

     సుకేష్ చంద్రశేఖర్‌పై ఆరోపణలు

    సుకేష్ చంద్రశేఖర్‌పై ఆరోపణలు


    పలు పారిశ్రామిక వేత్తల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడిన కేసులో సుకేష్ చంద్రశేఖర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 200 కోట్ల మేర కుంభకోణంలో ఈడీ విచారణ జరుగుతున్నది. రాన్ బాక్సీ కంపెనీ అధినేత బెదిరించిన డబ్బులను జాక్వలైన్ ఫెర్నాండేజ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడంతో ఆమెను పలుమార్లు విచారించారు. పాస్ పోర్టును స్వాధీనం చేసుకొన్నారు.

     పాటియాలా కోర్టులో పిటిషన్

    పాటియాలా కోర్టులో పిటిషన్


    సుకేష్ చంద్రశేఖర్ కేసులో జాక్వలైన్ కూడా భాగస్వామి అనే కోణంలో ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసు కారణంగా విదేశాల్లో షూటింగులకు హాజరు కాలేకపోతున్నాను. కాబట్టి నాకు విదేశాలకు వెళ్లేలా అనుమతి ఇవ్వాలని ఢిల్లీ పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో జాక్వలైన్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని కోర్టు విచారించింది.

    తప్పు దోవ పట్టించారంటూ

    తప్పు దోవ పట్టించారంటూ


    సుకేష్ చంద్రశేఖర్ తనను తప్పుదోవ పట్టించారు. నా జీవితాన్ని నరకంగా మార్చారు. నా భావోద్వేగాలతో ఆడుకొన్నాడు. ఇప్పుడు నా బతుకు తెరువుపై కూడా దెబ్బ వేశాడు. సుకేష్ చంద్రశేఖర్ ఎవరో తెలియదు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా నాకు పరిచయం ఏర్పడింది. నా మాటలతో మభ్య పెట్టి వాడుకొన్నాడు అని జాక్వలైన్ కోర్టుకు తెలిపింది.

    దుబాయ్‌కి వెళ్లేందుకు అనుమతి

    దుబాయ్‌కి వెళ్లేందుకు అనుమతి


    జాక్వలైన్ విన్నపం, ఆమె లాయర్ వాదనల తర్వాత కోర్టు న్యాయమూర్తి స్పందించారు. ఈ మేరకు ఈడీ అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఆమె వృతిపరమైన పనుల కోసం దుబాయ్‌కి వెళ్లాల్సి ఉంది. కాబట్టి ఆమెను విదేశాలకు వెళ్లేలా అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి అని ఈడీ అధికారులకు సూచించింది.

    English summary
    ED probing Sukesh Chandrashekhar's 200 crore scam. In this case, ED investigating the jacqualine Fernandez on bank Transfers of money.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X