»   »  మూడు ఆత్మలు, రెండు మృతదేహాలు, జీవిత ప్రయాణం.... ఆసుపత్రి నుండి ఇర్ఫాన్ ఖాన్ ట్వీట్!

మూడు ఆత్మలు, రెండు మృతదేహాలు, జీవిత ప్రయాణం.... ఆసుపత్రి నుండి ఇర్ఫాన్ ఖాన్ ట్వీట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన వ్యాధి భారిన పడి లండన్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. న్యూరో ఎండోక్రైన్‌ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ వ్యాధి చాలా తీవ్రమైనదని, ఆయన జీవితం చివరి దశలో ఉందంటూ ఆ మధ్య వార్తలు రావడం అభిమానులను సైతం కలిచి వేసింది. దీనిపై ఇర్ఫాన్ స్పందిస్తూ అభిమానులు, సన్నిహితుల ఆశీర్వాదంతో తన శక్తిమేర పోరాడతానని ట్విట్టర్ ద్వారా వెల్లడించి వారికి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత దాదాపు 2 నెలల నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఇర్ఫాన్ తాజాగా ఓ ట్వీట్ చేశారు.

Irrfan Khan released Karwaan first look

ఇర్ఫాన్ ఖాన్, దుల్కర్ సల్మాన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన హిందీ కామెడీ చిత్రం 'కర్వా'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇర్ఫాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. 'మూడు ఆత్మలు, రెండు మృతదేహాలు, జీవిత ప్రయాణం' అంటూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ మీద ఉన్న క్యాప్షన్‌ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది.

కర్వా అంటే ప్రయాణం అని అర్థం. ఈ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన ఆసక్తికర కామెంట్ చేశారు. 'రెండు ప్రయాణాలు . ఒకటి నాది మరొకటి సినిమాది' అని పేర్కొన్నారు. ఆగస్ట్‌ 10న 'కర్వా' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

'కర్వా' చిత్రానికి ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, క్రితి కర్బంద, మిథిలా పాల్కర్, అమలా అక్కినేని ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. వినోదంతో పాటు మనసుకు హత్కుకునే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

English summary
Irrfan Khan released Karwaan first look via twitter. He wrote: “Beginnings have the innocence that experience can’t buy. My best wishes to dulQuer , mipalkar for joining the karwaan. ‘ Two karwaans ‘ .... Mine and the movie !! MrAkvarious RSVPMovies RonnieScrewvala.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X