twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dilip Kumar Net Worth :వందల కోట్ల ఆస్తి.. ఆ విషయంలో ఇండియాలోనే మొదటి నటుడు!

    |

    బాలీవుడ్ లెజెండ్రీ నటుడు దిలీప్ కుమార్ ఈరోజు కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈరోజు పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విదించారు. నిజానికి ఆయన ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా మళ్లీ మళ్లీ ఆసుపత్రికి వెళుతున్న ఆయన చివరిగా జూన్ 30న ఆసుపత్రిలో చేరారు. కోలుకుని బయటకు వస్తారనగా ఈరోజు కన్నుమూశారు. ఇక ఆయన నికర ఆస్తి విలువ ఎంత ఉంటుంది అనే వివరాల్లోకి వెళితే

    Recommended Video

    #RIPDilipKumar: Bollywood Legend ట్రాజెడీ కింగ్.. అత్యధిక అవార్డులు గెలుచుని గిన్నిస్ రికార్డు

    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..

    గత ఏడాదే 98వ పుట్టినరోజు

    గత ఏడాదే 98వ పుట్టినరోజు

    గత ఏడాది తన 98వ పుట్టినరోజు జరుపుకున్న బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ ను ట్రాజెడీ కింగ్ మరియు బాలీవుడ్ ఫస్ట్ ఖాన్ అని ప్రేమగా పిలుస్తారు అభిమానులు. దశాబ్దాలుగా తన అభిమానుల హృదయాలలో శాశ్వత స్థానాన్ని సంపాదించిన దిలీప్ కుమార్ నికర విలువను పరిశీలిద్దాం. దిలీప్ కుమార్ ఆదాయం ఎలా ఉండేది ? అనే వివరాలు తెలుసుకుందాం.

    తెలుగు సినిమా, చిరంజీవితో దిలీప్ కుమార్ అనుబంధం.. మీరెప్పుడూ చూడని రేర్ ఫోటోలుతెలుగు సినిమా, చిరంజీవితో దిలీప్ కుమార్ అనుబంధం.. మీరెప్పుడూ చూడని రేర్ ఫోటోలు

    ఆయన ఆస్తుల విలువ ఎంతంటే

    ఆయన ఆస్తుల విలువ ఎంతంటే

    మీడియా పోర్టల్ సెలెబ్రిటీ నెట్ వర్త్‌లోని ఒక నివేదిక ప్రకారం, దిలీప్ కుమార్ ఆస్తుల నికర విలువ 85 మిలియన్లుగా ఉంది. రూపాయల్లో మార్చినప్పుడు ఈ మొత్తం 627 కోట్ల రూపాయలకు పైగా ఉంది. దిలీప్ కుమార్ ఆదాయానికి ప్రధాన వనరు నటన మాత్రమే. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఆయన చివరి సినిమా కిలా 1998లో చేశారు. ఆయన పార్లమెంటు సభ్యుడిగా కూడా ఉన్నారు. 1950వ దశకంలో ఒక్క సినిమాకి రూ .1 లక్ష వసూలు చేసిన తొలి నటుడు దిలీప్ కుమార్.

    అసలు పేరు ఏంటంటే?

    అసలు పేరు ఏంటంటే?

    దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్ కాగా ఆయన నాసిక్ లో పుట్టి పెరిగాడు. నటుడిగా మారడానికి ముందు, అతను ఆర్మీ క్లబ్‌లో శాండ్‌విచ్ స్టాల్ నడిపేవారు. అలా ఆ రోజుల్లో బొంబాయి టాకీస్ యజమాని దేవికారాణిని కలిశాడు, అక్కడ దిలీప్ కథ రచయితగా మరియు స్క్రిప్టింగ్ విభాగంలో పనిచేయడం ప్రారంభించారు. దిలీప్ కుమార్ 1944లో జ్వార్ భాటా అనే సినిమాతో బాలీవుడ్ పరిశ్రమలోకి ప్రవేశించారు.

    గిన్నిస్ రికార్డు కూడా

    గిన్నిస్ రికార్డు కూడా

    ఇక ఆయన 1947లో జుగ్ను అనే సినిమాలో నటించగా ఇది బాక్సాఫీస్ సూపర్ హిట్ గా నిలిచింది. దిలీప్ కుమార్ తన సినీ జీవితంలో మొత్తం ఉత్తమ నటుడిగా ఎనిమిది ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ఈ నటుడికి 1994 సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించింది. అంతేకాకుండా, ఒక భారతీయ నటుడిగా అత్యధిక సంఖ్యలో అవార్డులు గెలుచుకున్నందుకు గిన్నిస్ రికార్డు కూడా కలిగి ఉన్నాడు.

    అవార్డులు రివార్డులు

    అవార్డులు రివార్డులు

    దిలీప్ కుమార్ 1991 సంవత్సరంలో పద్మభూషణ్ మరియు 1998 లో నిషన్-ఎ-ఇంతియాజ్ లతో సత్కరించారు. ఈ నటుడు 2015 సంవత్సరంలో పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు. 1993లో ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా పొందారు. దిలీప్ కుమార్ 1991 సంవత్సరంలో పద్మ భూషణ్ మరియు 1998 లో నిషన్-ఎ-ఇంతియాజ్ లతో సత్కరించారు . ఈ నటుడు 2015 సంవత్సరంలో పద్మ విభూషణ్ గ్రహీతగా కూడా ఉన్నారు . 1993 లో ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును కూడా పొందారు.

    గమనిక : దిలీప్ కుమార్ ఆస్తుల యొక్క నికర విలువ సమాచారం వివిధ వెబ్‌సైట్లు మరియు మీడియా నివేదికల నుండి తీసుకోబడింది. ఈ గణాంకాల యొక్క 100% ఖచ్చితత్వానికి మా వెబ్‌సైట్ హామీ ఇవ్వదు.

    English summary
    Veteran Bollywood actor Mohammed Yusuf Khan, world-famous as Dilip Kumar, passed away here in the early hours of Wednesday. here is a look at his net worth and income details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X