శ్రీదేవి సినిమా తరహాలో..అతిలోక సుందరిని గుర్తు చేసేలా..!
బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ నటిస్తున్న తాజా చిత్రం అక్టోబర్. బనిత సందు ఈ చిత్రంలో వరుణ్ సరసన నటిస్తోంది. తాజగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రయిలర్ ని చూసిన వారంతా దివంగత నటి శ్రీదేవి చిత్రం వసంతకోకిల సినిమాని గుర్తు చేసేలా ఉందని అంటున్నారు. వసంత కోకిల చిత్రం హిందీలో సద్మా గా విడుదలయింది. ఈ చిత్రం కమల్ హాసన్, శ్రీదేవి ఇద్దరికీ ఓ మధురానుభూతి.
కాగా అక్టోబర్ చిత్ర ట్రయిలర్ కూడా అదే తరహాలో ఉన్నట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. కొన్ని ఊహించని ఘటనల వలన హీరోయిన్ గతాన్ని మరచిపోతుంది. హీరో ఆమె కోసం ఏం చేసాడు, ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనేది ఈ చిత్ర కథ. అక్టోబర్ చిత్ర ట్రైలర్ కూడా అదే తరహాలో ఉంది. అక్టోబర్ చిత్రంపై అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్ర పోస్టర్స్ ఇప్పటికే అభిమానులని బాగా ఆకర్షించాయి.


Click it and Unblock the Notifications











