Rhea Chakraborty ఆ విషయంలో నన్ను నమ్మండి.. ఎమోషనల్ పోస్ట్.. సిద్దార్థ్ పితాని అరెస్ట్‌కు ముందు!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి ఏడాది పూర్తి కావొస్తున్న సమయంలో అనేక సంచలన విషయాలు మళ్లీ చోటుచేసుకొంటున్నాయి. గతేడాది జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకొని మరణించడం పరిస్థితుల్లో పలు అనుమానాలను రేకెత్తించింది. ఈ క్రమంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...

సుశాంత్‌తో గొడవపడి బయటకు

సుశాంత్‌తో గొడవపడి బయటకు

గతేడాది అంటే 2020 లాక్‌డౌన్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఇంటిలోనే ఉంటూ అతడితోనే రియా చక్రవర్తి సహజీవనం చేశారు. అయితే జూన్ 14వ తేదికి ముందు సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ హత్య జరగడం సంచలనం రేపింది. ఆ తర్వాత సుశాంత్‌తో గొడవపడి అతడి ఇంటి నుంచి రియా చక్రవర్తి బయటకు వెళ్లినట్టు వార్తలు వచ్చాయి.

రియా చక్రవర్తిపై అనేక అనుమానాలు

రియా చక్రవర్తిపై అనేక అనుమానాలు

రియా చక్రవర్తి ఇంటి నుంచి వెళ్లిన రెండు, మూడు రోజుల తర్వాతే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఆ తర్వాత రియా చక్రవర్తిపై అనేక అనుమానాలు రావడం, ఆపై డ్రగ్స్ కేసులో అరెస్టై నెలరోజుల పాటు జైలులో ఉండటం లాంటి సంఘటనలు చకచకా జరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రియా చక్రవర్తి జీవితం అనేక కుదుపులకు లోనైంది.

సుశాంత్ సింగ్ వర్థంతికి ముందు

సుశాంత్ సింగ్ వర్థంతికి ముందు

డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి కామెంట్లు చేయలేదు. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తొలి వర్ధంతి, సిద్దార్థ్ పితాని అరెస్ట్‌కు ముందు రియా చక్రవర్తి తన ఇన్స్‌టాగ్రామ్‌లో నర్మగర్భమైన పోస్టు పెట్టారు. ఇప్పుడు ఆ పోస్టు అనేక అనుమానాలకు, సందేహాలకు తావివ్వడమే కాకుండా చర్చనీయాంశమైంది.

రియా చక్రవర్తి ఎమోషనల్ పోస్టు

రియా చక్రవర్తి ఎమోషనల్ పోస్టు

గతేడాది తన జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలను దృష్టిలో పెట్టుకొని.. మహా విషాదం నుంచి గొప్ప మానసిక స్థైర్యం కలిగేలా ప్రయాణం జరిగింది. ఏదైతే నా ప్రతిష్టను దెబ్బ తీసిందో ఆ విషయాలపై నన్ను మీరంతా నమ్మాలి. నేను వారి ప్రేమలో ఎప్పుడూ మునిగి తేలుతూ ఉంటాను అంటూ రియా చక్రవర్తి పోస్టు పెట్టింది.

రియా చక్రవర్తి పోస్టు పెట్టిన కొద్ది గంటల్లోనే

రియా చక్రవర్తి పోస్టు పెట్టిన కొద్ది గంటల్లోనే

రియా చక్రవర్తి పోస్టు పెట్టిన కొద్ది గంటల్లోపే సుశాంత్ మరణం కేసులో అనుమానితుడు, ఆయన స్నేహితుడు సిద్దార్థ్ పితానిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేయడడం సంచలనం రేపింది. సిద్దార్థ్ అరెస్ట్‌ను ముందే ఊహించి ఈ పోస్టు పెట్టిందా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Recommended Video

Actress Payal RajPut ఇంట విషాదం.. ఎమోషనల్ పోస్ట్!! || Filmibeat Telugu
సుశాంత్ కేసులో 12 వేల పేజీలతో చార్జిషీట్

సుశాంత్ కేసులో 12 వేల పేజీలతో చార్జిషీట్

ఇది ఇలా ఉండగా, సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ ఇప్పటికే 12 వేల పేజీలతో కూడిన చార్జిషీట్‌ను దాఖలు చేసింది. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితోపాటు దాదాపు 33 మందిని అరెస్ట్ చేసింది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఎన్సీబీ తన కేసు దర్యాప్తు వేగం పెంచి సిద్దార్థ్ పితానిని అరెస్ట్ చేయడం సెన్సేషన్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X