twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాధే చెత్త సినిమా.. సల్మాన్ గాలి తీసేసిన తండ్రి సలీం ఖాన్

    |

    బాలీవుడ్‌లో సలీమ్ ఖాన్ అంటే 80, 90 దశకంలో బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. జావెద్ అఖ్తర్‌తో కలిసి జంజీర్, హాథీ మేరి సాథీ, యాదోంకి బారాత్, దీవార్, షోలే, డాన్, కాలా పత్తర్, షాన్, క్రాంతి, శక్తి, మిస్టర్ ఇండియా, బాఘ్‌బన్ చిత్రాలకు కథ అందించారు. అయితే సినిమా సత్తాను అంచనా వేయడంలో ఆయనకు మించిన వారు ఉండరనే విషయాన్ని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటాయి. అయితే తాజాగా తన కుమారుడు సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమాపై నిక్కచ్చిగా రివ్యూ అందించారు.

    ఇటీవల బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. దబంగ్ 3 డిఫరెంట్ సినిమా. భజరంగీ భాయ్జాన్ మంచి సినిమానే కాదు విభిన్నమైన చిత్రం. అయితే రాధే చిత్రం గొప్ప సినిమా కాదు కానీ... కమర్షియల్‌గా అందరికీ డబ్బులు సంపాదించే సినిమా అని సలీం తన అభిప్రాయాన్ని చెప్పారు.

    Salman Khan father Salim Khan says Radhe is not good movie

    రాధే సినిమా వల్ల నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లాంటి వాళ్లకు మంచి లాభాలు వచ్చాయి. సినిమా కొన్నవాళ్లందరూ లాభాలను గడించారు. ఇన్ని లాభాలు ఉన్న ప్పటికీ రాధే చెత్త సినిమా అని పేర్కొన్నారు.

    ఇక ఇటీవల ఓటీటీలో విడుదలైన రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ సినిమాపై సినీ విమర్శకులు పెదవి విరిచారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఐఎమ్‌డీబీ 1.8/10 రేటింగ్ ఇచ్చింది. అయితే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టింది.

    English summary
    Bollywood superstar Salman Khan's father, Star Writer Salim Khan says Radhe is not good movie but It's commercially fantastic. He reviewed well on this movie. IMDB rated this movie as 1.8/10
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X