దబంగ్ 3 షూటింగ్ ప్రారంభం.. మేము పుట్టిన ఊరిలోనే షూటింగ్.. సల్మాన్ ఎమోషనల్

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏడేళ్ల తర్వాత మళ్లీ చుల్‌బుల్ పాండే అవతారం ఎత్తాడు. దబంగ్3 చిత్ర షూటింగ్ సోమవారం ఇండోర్‌లో ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్, అర్బాజ్ ఖాన్ జన్మస్థలంలో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించడం విశేషంగా మారింది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తుండగా.. సోనాక్షి సిన్హా మరోసారి సల్మాన్‌తో జతకట్టింది.

దబంగ్ 3 సినిమా షూటింగ్ ప్రారంభమైనట్టు సల్మాన్ ఖాన్ తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు అర్బాజ్ ఖాన్‌తో కూడిన వీడియోను షేర్ చేశారు. అర్బాజ్ ఖాన్, నేను ఎక్కడైతే పుట్టామో.. అదే ఇండోర్‌లో దంబంగ్ సినిమా షూట్‌ను మొదలుపెట్టాం. మా తాత ఎక్కడైతే పోలీస్ ఆఫీసర్‌గా నియమితుడయ్యాడో.. ఆ ప్రదేశాలైన మండలేశ్వర్, మహేశ్వర్ ప్రాంతాలకు వెళ్తున్నాం అని ఆదివారం పోస్టు చేసిన వీడియోలో సల్మాన్ అన్నారు.

Salman Khans Dabangg 3 shoot started

బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా రూపొందిన దంబంగ్ సినిమాకు అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. దబంగ్ 2 సినిమాకు అర్బాజ్ ఖాన్ డైరెక్టర్‌గా అవతారం ఎత్తారు. ఇప్పుడు ప్రభుదేవా మూడో దబంగ్‌కు శ్రీకారం చుట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X