సల్మాన్ ఖాన్‌కు సమన్లు.. జర్నలిస్టుపై దాడి కేసులో కోర్టు షాక్

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు బాడీ‌గార్డ్‌కు ముంబై కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. జర్నలిస్టు అశోక్ పాండేపై దాడి కేసులో సల్మాన్‌తో అంగరక్షకుడు నవాజ్ షేక్‌కు కోర్టు సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

2019లో సైకిల్‌పై ముంబై రోడ్లపై సల్మాన్ ఖాన్‌ వెళ్లిన సమయంలో ఈ వివాదం చోటు చేసుకొన్నది. సల్మాన్ సైకిల్‌పై వెళ్తుంటే.. మీడియా ప్రతినిథులు, ఫోటోగ్రాఫర్లు ఎగబడి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నవాజ్ షేక్ తనతో దురుసుగా ప్రవర్తించారు. ఆ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్‌ కూడా తనను బెదిరించారు.

ఫోటోలు తీస్తుంటే సల్మాన్ ఖాన్ తన మొబైల్ ఫోన్ లాగేసుకొన్నాడు. తనతో వాదనకు దిగి అనుచిత వ్యాఖ్యలు చేశారు అని జర్నలిస్టు అశోక్ పాండే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడికి, వాగ్వాదానికి దిగిన సల్మాన్ ఖాన్, షేక్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు.

Salman Khan summoned by Mumbai Court in Journalist Assault case

జర్నలిస్టు అశోక్ పాండే ఫిర్యాదుపై స్పందించిన డీఎన్ నగర్ పోలీసులు కేసుతోపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 504 (ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టడం), 506 (నేరపూరిత చర్యలు), కింద కేసు నమోదు చేశారు. సల్మాన్, షేక్ విచారణకు హాజరు కావాలంటూ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ ఆర్ ఖాన్ ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్ ఖాన్, బాడీగార్డును ఏప్రిల్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు.

సమన్ల జారీ చేయడంపై కోర్టు వర్గాలు స్పందిస్తూ.. పోలీసుల దర్యాప్తు, సాక్ష్యాధారాల ఆధారంగా సమన్లు జారీ చేశాం. అభియోగం మోపిన వ్యక్తులను విచారించడానికి ఆధారాలు ఉన్నాయి అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X