సమంత రెమ్యునరేషన్‌పై మరో వివాదం.. మనోజ్ బాజ్‌పేయికి ఇచ్చింది 10 కోట్లు కాదా?
అత్యంత ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్‌కు సీక్వెల్‌గా వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజై సినీ విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటున్నది. వివాదాల మధ్య విడుదలైన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో భారీగా ఆకట్టుకొన్నది. ఈ క్రమంలో ఫ్యామిలీ మ్యాన్ మూవీలో నటించిన వారి పారితోషికాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే మీడియాలో వస్తున్న మనోజ్ బాజ్‌పేయ్, సమంత అక్కినేని రెమ్యునరేషన్ల వార్తలు అవాస్తవమని బాలీవుడ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ వార్త వివరాల్లోకి వెళితే...

వివాదాల మధ్య ది ఫ్యామిలీ మ్యాన్
తమిళ ఈలం కోసం పోరాడిన కథా నేపథ్యంతో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజ్‌కు వివాదంలో చిక్కుకొన్నది. తమిళుల మనోభావాలు, సెంటిమెంట్లకు వ్యతిరేకంగా.. తమిళ సంస్కృతికి వ్యతిరేకంగా ఉంది. ఈ వెబ్ సిరీస్‌ను బ్యాన్ చేయాలి అంటూ కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తమిళ ఐటీ మంత్రి త్యాగరాజ్ లేఖ రాయడం సంచలనం రేపింది.

మనోజ్ బాజ్‌పేయ్, సమంత రెమ్యునరేషన్లు
ఇలాంటి వివాదాల మధ్య రిలీజైన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ భారీ హిట్ అయిన నేపథ్యంలో అందులో నటించిన యాక్టర్ల పారితోషికాల వార్త వైరల్ అయ్యాయి. ఈ వెబ్ సిరీస్‌లో నటించినందుకు మనోజ్ బాజ్‌పేయ్‌కి రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారని, అలాగే సమంతకు 5 కోట్లకుపైగా పారితోషికం ఇచ్చారనే విషయం చర్చనీయాంశమైంది.

మనోజ్, సమంతకు ఇచ్చింది ఎంతంటే
అయితే ఐడబ్ల్యూఎం బజ్ అనే పత్రిక కథనం ప్రకారం.. మనోజ్ బాజ్‌పేయ్‌కి రూ. 2.5 కోట్లు చెల్లించారు. అలాగే సమంతకు పారితోషికంగా రూ.1.5 కోట్లు ఇచ్చారు. మిగితా నటీనటులకు చాలా తక్కువ మొత్తం చెల్లించారు. మీడియాలో చక్కర్లు కొడుతున్న పారితోషికాల విలువ అవాస్తవం అని పేర్కొన్నది.
Recommended Video

తమిళ టెర్రిరిస్టుగా సమంత
ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత అక్కినేని తమిళ టెర్రిరిస్టుగా కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రం ద్వారా సమంత హిందీలోకి ప్రవేశించారు. అలాగే వెబ్ సిరీస్‌లో ప్రియమణి, షారీబ్ హష్మీ, శరద్ ఖేల్కర్ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం అనూహ్యమైన స్పందనతో ముందుకెళ్తున్నది.


Click it and Unblock the Notifications











