twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    18 Years Of Simhadri: ఆ హీరోతో ఫాంటసీ కథను క్యాన్సిల్ చేసుకొని.. రాజమౌళి క్రియేట్ చేసిన బాక్సాఫీస్ రికార్డ్!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో సింహాద్రి ఒకటి. స్టూడెంట్ నెంబర్ 1 లాంటి హిట్ సినిమా అనంతరం రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా విడుదలై నేటికి 18 ఏళ్లవుతోంది. ఇక సినిమాను మొదట ఒక స్టార్ హీరో అయితే రిజెక్ట్ చేశాడు. కానీ ఎన్టీఆర్ తో జక్కన్న హిట్టు కొట్టేశాడు. ఇక అప్పట్లో వచ్చిన సినిమా కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

    రాఘవేంద్రరావు రావు కొడుకుతో..

    రాఘవేంద్రరావు రావు కొడుకుతో..

    దర్శకధీరుడు రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో కమర్షియల్ గా మంచి హిట్ అందుకున్న తరువాత ఒక ఫాంటసీ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు. రాఘవేంద్రరావు కొడుకు సూర్య ప్రకాష్ తో ఆ సినిమా చేయాలని అనుకున్నారు.కానీ ఆ సినిమా బడ్జెట్ కారణంగా చర్చల దశలోనే ఆగిపోయింది.

    అందుకే సింహాద్రి కథ అలా యూ టర్న్

    అందుకే సింహాద్రి కథ అలా యూ టర్న్

    ఇక రాజమౌళి తండ్రి కె.విజయేంద్ర ప్రసాద్ రాసిన సింహాద్రి కథను మొదట బాలకృష్ణతో చేయాలని అనుకున్నారు. దర్శకుడిగా బి.గోపాల్ కూడా ఫైనల్ అయ్యారు. కానీ అప్పట్లో బాలకృష్ణ వరుసగా అదే తరహా సినిమాలు చేస్తుండడం వలన రొటీన్ అవుతుందని జానర్ మార్చాలని అనుకున్నారు. అందుకే సింహాద్రి కథ అలా యూ టర్న్ తీసుకుంది.

    రాజమౌళి వద్దకు రాగానే

    రాజమౌళి వద్దకు రాగానే

    ఇక రాజమౌళి వద్దకు రాగానే కథలో కొన్ని మార్పులు చేసి తనకు నచ్చినట్లు స్క్రిప్ట్ ను రెడీ చేయించుకున్నారు. ఉహించినదానికంటే సినిమా కథ తెరపై చాలా అద్భుతంగా వచ్చింది. మొదటి రోజు సింహాద్రి మంచి టాక్ తో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. రాజమౌళి - ఎన్టీఆర్ స్టార్ ఇమేజ్ కూడా ఒక్కసారిగా అకాశాన్ని తాకింది.

    మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కు వచ్చేలా చేశాయి

    మళ్ళీ మళ్ళీ థియేటర్స్ కు వచ్చేలా చేశాయి

    ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన భూమిక హీరోయిన్ గా నటించగా అంకిత మరో గ్లామత్ పాత్రలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక సినిమాకు కీరవాణి అంధించిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అలాగే మ్యూజిక్ కు తగ్గట్లుగానే ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు కూడా ఓ వర్గం వారిని మళ్ళీ థియేటర్స్ కు వచ్చేలా చేశాయి.

    Recommended Video

    Simhadri సినిమా విజయం లో ఆయనదే ముఖ్య పాత్ర - Jr Ntr | Doraswamy Raju ఇక లేరు !
    బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?

    బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?

    ఇక సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే 9కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సింహాద్రి సినిమా వరల్డ్ వైడ్ గా 46కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. దాదాపు 28కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ అందినట్లు సమాచారం. అంతే కాకుండా అప్పట్లో అత్యదిక సెంటర్లలలో 100రోజులు ఆడిన సినిమాల్లో కూడా స్థానం సంపాదించుకుంది.

    English summary
    18 Years Of Simhadri box office collections, Simhadri is a 2003 Indian Telugu-language action drama film directed by S. S. Rajamouli from a story written by K. V. Vijayendra Prasad. The film stars N. T. Rama Rao Jr., Bhumika Chawla, and Ankitha with Mukesh Rishi, Nassar, and Rahul Dev playing supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X