అమీర్ ఖాన్ ‘పికె’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?

By Bojja Kumar

హైదరాబాద్: అమీర్ ఖాన్, అనుష్క శర్మ ప్రధాన తారాగణంగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పికె' చిత్రం డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతోంది. అమీర్ ఖాన్ సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. అంచనాలకు తగిన విధంగానే తొలిరోజు కలెక్షన్లు అదిరాయి.

తొలి రోజు ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. రూ. 26.63 కోట్లు వసూలు చేసింది. అమీర్ ఖాన్ కెరీర్లో ఇది సెకండ్ హయ్యెస్ట్ ఫస్ట్ డే గ్రాసర్ కావడం గమనార్హం. గతంలో అమీర్ ఖాన్ నటించిన ధూమ్-3 చిత్రం 36.22 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు బాలీవుడ్లో తొలిరోజు హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన టాప్-10 సినిమాల లిస్టులో ‘పికె' చిత్రం 7వ స్థానం దక్కించుకుంది.

Aamir Khan's PK Opening Day collection

పికె అనేది ఒక డిఫరెంట్ చిత్రం. ఇందులో అమీర్ ఖాన్ తన భిన్నమైన నటనతో ఆకట్టుకున్నారు. అమీర్ ఖాన్ కెరీర్లో ఇది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చిత్రమని చెప్పొచ్చు. అనుష్క శర్మ, బోమన్ ఇరానీ, తదితరులు బాగా నటించారు. దర్శకుడు 2 గంటల 33 నిమాషాల పాటు ఫన్నీగా, డిఫరెంటు కాన్సెప్టుతో సోషల్ మెసేజ్ జోడిస్తూ సినిమా సాగింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన శంతను మిత్రా, అజయ్ -అతుల్, అంకిత్ తివారీ, రామ్ సంపత్ మంచి పని తీరు కనబరిచారు. వారి మ్యూజిక్ స్టోరీలైన్ తో పర్ ఫెక్టుగా సింక్ అయ్యాయి.

అభిజిత్ జోషి, రాజ్ కుమార్ హిరానీ రాసిన డైలాగులు ఫన్నీగా ఉండటంతో పాటు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసే విధంగా ఉన్నాయి. స్టోరీ నేరేషన్ కూడా బావుంది. ఓవరాల్ గా చెప్పాలంటే పికె పైసా వసూల్ మూవీ. ప్రేక్షకులను సంతృప్తి పరిచే మూవీ.

బాలీవుడ్లో తొలిరోజు కలెక్షన్ల విషయంలో ఇప్పటి వరకు హ్యాపీ న్యూఇయర్ రూ. 44.97 కోట్లతో మొదటిస్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ధూమ్-3 రూ. 36.22 కోట్లు, చెన్నై ఎక్స్‌ప్రెస్ రూ. 33.12 కోట్లు, ఎక్‌థా టైగర్ రూ. 32.93 కోట్లు, సింగం రిటర్న్స్ రూ. 32.09 కోట్లు, బ్యాంగ్ బ్యాంగ్ రూ. 27.54 కోట్లు, పికె 26.63 కోట్లు, కిక్ రూ. 26.40 కోట్లు, క్రిష్-3 రూ. 25.50 కోట్లు, అగ్నిపథ్ రూ. 23 కోట్లు వసూలు చేసాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X