»   » బాహుబలి తర్వాత భారీ లాభాలు కాటమరాయుడికే... ఎంతో తెలుసా?

బాహుబలి తర్వాత భారీ లాభాలు కాటమరాయుడికే... ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు భారీ లాభాలు ఆర్జించిన సినిమా ఏదైనా ఉంటే అది 'బాహుబలి' సినిమా మాత్రమే. ఈ సినిమా సాధించిన వసూళ్లు అప్పట్లో సంచలనం. తాజాగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి తర్వాత భారీ లాభాలు వచ్చింది 'కాటమరాయుడు' చిత్రానికే అనే టాక్ వినిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ కాకుండా...'కాటమరాయుడు' సినిమాను రూ. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించారని, సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా సాగిందని అంటున్నారు. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో, వీడియో, డిజిటల్ రైట్స్ ఇలా అన్ని కలిపి రూ. 115 కోట్లు వచ్చాయట.


టోటల్ ప్రాఫిట్

టోటల్ ప్రాఫిట్

కాటమరాయుడు సినిమా ద్వారా ఇప్పటి వరకు మొత్తం రూ. 85 కోట్ల లాభం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంత భారీ మొత్తంలో లాభాలు రావడానికి కారణం పవన్ కళ్యాణ్ మీద ఉన్న క్రేజ్ అని చెప్పక తప్పదు.


పవన్ కళ్యాన్ రెమ్యూనరేషన్

పవన్ కళ్యాన్ రెమ్యూనరేషన్

పవన్ కళ్యాణ్ సినిమా లాభాల్లో 60 శాతం రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారని, అంటే రూ. 51 కోట్లు ఆయనకు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిర్మాతకు ఎంత?

నిర్మాతకు ఎంత?

లాభాల్లో 60 శాతం పవన్ కళ్యాణ్ కు వెళ్లగా నిర్మాత శరత్ మరార్ కు 40 శాతం... అంటే రూ. 34 కోట్లు ఆయన జేబులో వేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.


 ఖైదీ,కాటమరాయుడు దాదాపు సమానం

ఖైదీ,కాటమరాయుడు దాదాపు సమానం

ఇటీవల విడుదలైన మెగాస్టార్ మూవీ ఖైదీ నెం 150 సినిమాకు కూడా కాటమరాయుడు లెవల్లోనే బిజినెస్ జరిగిందని, అంకెలు కాస్త అటు ఇటుగా ఉండొచ్చు. అని అంటున్నారు. చిరు రెమ్యూనరేషన్ కాకుండా ‘ఖైదీ నెం 150' చిత్రాన్ని రూ. 40 కోట్లతో నిర్మించారు.


ఎన్నికల కోసమే

ఎన్నికల కోసమే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పార్టీ తరుపున అభ్యర్థులను బరిలోకి దించడంతో పాటు తాను కూడా పోటీ చేయబోతున్నాడు. పార్టీ నడపటం అంటే డబ్బు కూడా అవసరం. అందుకే వీలైనన్ని సినిమాలు చేసి పార్టీ కోసం వీలైనన్ని నిధులు సమకూరుస్తున్నట్లు అంతా చర్చించుకుంటున్నారు.


English summary
Film Nagar sourcr said that, After 'Baahubali', It's only 'Katamarayudu' which fetched so much profit for the Makers. Pre-Release Business of this Pawan Kalyan-starrer is anywhere around Rs 115 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu