For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అజిత్ "వీరుడొక్కడే'' విడుదల తేదీ ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : అజిత్ తమన్నా జంటగా శౌర్యం ఫేం శివ దర్శకత్వంలో తమిళలంలో భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ వీరమ్. ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలై ఘనవిజయం సాధించి అజిత్ కెరియర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది ఈ చిత్రాన్ని ఓమిక్స్ అధినేత డాక్టర్ జి.శ్రీనుబాబు తెలుగు హక్కులను సొంతం చేసుకుని వీరుడొక్కడే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న విషయం విదితమే. అయితే తాజాగా ఈ చిత్రాన్ని భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మల పల్లి రామ సత్యనారాయణ విడుదల చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 21 న సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

  నిర్మాత మాట్లాడుతూ "నిర్మాతలకు ఆదర్శప్రాయులైన విజయా నాగిరెడ్డి శతజయంతి జరిగిన ఈ ఏడాదే విజయా ప్రొడక్షన్స్ తమిళంలో నిర్మించిన సినిమా 'వీరం'. ఈ సినిమా తెలుగు హక్కులు మాకు లభించినందుకు ఆనందంగా ఉంది. సబ్జెక్ట్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. దేవిశ్రీ మంచి సంగీతాన్ని సమకూర్చారు. అజిత్, తమన్నాపై స్విట్జర్లాండ్‌లో తీసిన పాటలు సూపర్‌గా ఉన్నాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రాజమండ్రి, అరకు, రామోజీ ఫిల్మ్‌సిటీలో తెరకెక్కించారు. అరకులో 15 రోజుల పాటు చిత్రీకరించిన ట్రెయిన్ ఫైట్ ఈ సినిమాకు హైలైట్. శివ ఈ సినిమాను అన్ని వర్గాల వారికీ నచ్చేలా తెరకెక్కించారు. సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.

   Ajith’s Veerudokkade Release date

  దర్శకుడు శివ మాట్లాడుతూ.. '' శివా... గ్రామీణ వాసన నిండేలా.. కథలో బంధుత్వం, స్నేహితులు ఎక్కువగా ఉండేలా ఓ మంచి కథను ఎంచుకో. నటించాలనుందని అజిత్‌ చెప్పారు. అప్పుడే 'వీరం' కథ వినిపించా. ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు. అజిత్‌ను మాస్‌గా చూడాలనుకునే అభిమానులకు ఇది పెద్ద పండగే. ట్రైలర్ లో 'మీ అన్నయ్య.. గంభీరమైన వ్యక్తి.. చాలా మంచివాడు.. హ్యాండ్‌సమ్‌..' అంటూ అజిత్‌ గురించి తమన్నా చెప్పే మాటలు ట్రైలర్‌కు హైలెట్‌గా నిలుస్తున్నాయి.

  దేవిశ్రీప్రసాద్‌ మాట్లాడుతూ. '' అజిత్‌ సినిమాకు తొలిసారి సంగీతం సమకూర్చడం చాలా సంతోషంగా ఉంది. స్టూడియోకు వచ్చిన అజిత్‌.. అన్ని వాద్య పరికరాలను వాయించారు. అంతేకాకుండా కొన్ని ట్యూన్ల రూపకల్పనను దగ్గరుండి చూశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమిది''అని చెప్పారు. ప్రదీప్ రావత్, నాజర్, సంతానం తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: వెట్రి, నిర్మాత: డా.శ్రీనుబాబు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ.

  English summary
  Ajith’s mass action entertainer ‘Veeram’ is being dubbed into Telugu and this movie is going to be known as ‘Veerudokkade’ here. The Telugu rights of this project have been picked up by Omix Creations and arrangements are being made for an end march release. Tamanna is the heroine in this movie and Devi Sri Prasad has composed the music.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X