»   »  హిట్టేది?

హిట్టేది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ వారం సుదీర్ఘకాలం నిర్మాణం జరుపుకున్న 'నా మనసుకేమయింది' విడుదలైంది. పరమేష్ హీరోగా పరిచయం అయిన ఈ సినిమాలో సింధు తులానీ హీరోయిన్ గా నటించింది. అలాగే కమిడియన్లు కృష్ణ భగవాన్, రఘుబాబు హీరోలుగా 'దొంగ సచ్చినోళ్ళు' విడుదలైంది. రంభ వీరికి జంట గా చేసింది. కాని చిత్రంగా ఈ రెండు సినిమాలు రిలీజయ్యాయనే విషయం మాట్లాడుకునే వారే కరువయ్యారు.

ఇక అంతకు ముందు వారం రిలీజయిన 'బొమ్మనా బ్రదర్స్ - చందనా సిస్టర్స్' , 'మైఖేల్ మదన్ కామరాజు' సినిమాల పరిస్ధితి అంతకన్నా ఘోరంగా ఉంది. దాంతో పూర్తి స్ధాయి ప్లాపులుగా సెటిలయి పోయాయి. బి.సి సెంటర్లలలో వర్కవుట్ అవుతాయేమో అనుకున్న దర్శకనిర్మాతల ఆశలని కామిడీ గా నీరుగార్చేసాయి.

ఇక పవన్ కళ్యాణ్, ఇలియానా నటించిన 'జల్సా' కలెక్షన్స్ వేసవి సెలవుల ఎఫెక్టు లేకుండా నీరసంగా ఉన్నాయి. 'భలే దొంగలు' అయితే బయిట యావరేజి టాక్ తెచ్చుకున్నా ...థియేటర్లు బావురమంటున్నాయి.

పస లేని కథ, నీరసమైన కథనాలతో వచ్చిన ఈ సినిమాలన్ని ఒకే రేంజిలో పరుగెడుతున్నాయి. ఇక నిన్న రిలీజయిన 'పరుగు' ప్రస్తుతం మంచి కలెక్షన్ లతో పరుగెడుతోంది. కాని డివైడ్ టాక్ తెచ్చుకోవటంతో అది ఎంత కాలం నిలబడుతుందో తెలియటం లేదు. దాంతో వచ్చే వారం రిలీజయ్యే 'కంత్రి' పైనే అందరి కళ్ళూ ఉన్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X