అల్లరి నరేష్ 'లడ్డుబాబు' దర్శకుడి వల్లే ప్లాప్.. బలవంతంగా ఖర్చు చేయించారు.. ఎన్ని కోట్లు నష్టమంటే: నిర్మాత
డైరెక్టర్ రవిబాబు బిగ్ బడ్జెట్ లో తీసిన సినిమాల్లో లడ్డుబాబు ఒకటి. ఆ సినిమా విడుదలకు ముందు హైప్ బాగానే క్రియేట్ చేసింది గాని రిలీజ్ అయిన తరువాత దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. నిర్మాతకు సగం డబ్బులు కూడా వెనక్కి రాలేదట. ఆ సినిమాను నిర్మించిన నిర్మాతల్లో ఒకరైన త్రిపురనేని చిట్టిబాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పూర్తి బడ్జెట్ వివరాలను బయటపెట్టారు. అలాగే రవిబాబుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనవసరంగా చేసిన సినిమా అంటూ ఆవేదన చెందారు.

లడ్డుబాబు కోసం.. కష్టపడిన నరేష్
లడ్డుబాబు సినిమాను దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా నరేష్ ను లావుగా చూపించి ఫస్ట్ లుక్ లోనే అందరికి షాక్ ఇచ్చాడు. ఇక నరేష్ కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తే బావుంటుందని ఆ సినిమా కోసం ఎంతో శ్రమించాడు. రోజుకు నాలుగు గంటలు మేకప్ వేసుకోవాడనికి టైమ్ పట్టేది.

దాదాపు 60 రోజుల పాటు
హాలీవుడ్ నుంచి ఒక మేకప్ ఆర్టిస్టును తెప్పించి మరి నరేష్ లుక్ పై భారీగా ఖర్చు చేయించారు. దాదాపు 60 రోజుల పాటు ఆ లుక్కుతో నానా అవస్థలు పడిన నరేష్ తిండి కూడా సరిగ్గా తినలేదు. నరేష్ పడిన కష్టానికైనా సరే ఆ సినిమా హిట్టవ్వాలి అని చాలామంది కోరుకున్నారు. కానీ కంటెంట్ అంత కొత్తగా లేకపోవడమే కాకుండా చాలా సీన్స్ చిరాకు తెప్పించాయనే కామెంట్స్ వచ్చాయి.

సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం దర్శకుడే
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత చిట్టి బాబు అసహనం వ్యక్తం చేస్తూ ఆ సినిమా ప్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం దర్శకుడే అని అన్నారు. సినిమాలో చాలా పొరపాట్ల గురించి ముందే చెప్పినప్పటికీ ఇది లేటెస్ట్ ట్రెండ్ అంటూ బలవంతంగా ముందుకి తీసుకివెళ్లారు. నా తమ్ముడు ప్రొడక్షన్ వర్క్స్ చూసుకునేవాడు. నేను అప్పుడు రాజకీయాల్లో ఎక్కువగా బిజీగా ఉండడం వలన మరింత ఫోకస్ పెట్టలేకపోయాను.. అని అన్నారు.

బడ్జెట్ భారీగా ఖర్చు చేశారు
ఇక సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. మొదట 8 కోట్ల వరకు అనుకున్నప్పటికీ ఆ తరువాత అనవసరపు ఖర్చులతో 11కోట్లకు పైగా ఖర్చు చేయించారు. మేకప్ మ్యాన్ విషయంలో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. తమిళ్ లో సూర్యకు వర్క్ చేసిన మంచి ఆర్టిస్ట్ ఉన్నారని చెప్పినప్పటికీ వినలేదు.. అని చెప్పారు.
Recommended Video

చివరికి వచ్చింది అంతే..
ఇక చివరికి సినిమా రిలీజ్ టైమ్ కు కొనడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. రిలీజ్ అనంతరం దాదాపు 8కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. కేవలం ఒక్క శాటిలైట్ హక్కుల ద్వారా మూడు కోట్ల వచ్చాయి. అది కూడా బ్రతిమాలి సన్ నెట్వర్క్ ద్వారా డీలింగ్ సెట్ చేయడంతో ఆ మాత్రం అయినా వచ్చింది. అనవసరంగా తెలిసి తెలిసి సినిమా అంటూ కంటెంట్ బాగలేకపోయినా రవిబాబుతో సినిమా చేయడం పెద్ద తప్పు.. అని చిట్టిబాబు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











