»   »  బ్యాడ్..ఆ నాలుగు ప్లాఫే(ట్రేడ్ టాక్)

బ్యాడ్..ఆ నాలుగు ప్లాఫే(ట్రేడ్ టాక్)

Subscribe to Filmibeat Telugu
Arundhati
పెద్ద మార్పేమీ లేదు. అరుంధతి తప్ప చెప్పుకోతగిన వసూలు చేస్తున్న చిత్రం కనుచూపు మేరలో కనపడటం లేదు. యధావిధిగానే..ఈ వారం కూడా రిలీజైన నాలుగు సినిమాలు తెలుగు సినీ పరిశ్రమను పూర్తి స్ధాయి నిరాశలో ముంచాయి. అవి బ్యాంక్, శ్రీశైలం, వేట, మంజీర.

కోర్టు కేసులు,ఫైనాన్స్ ప్లాబ్లం,నటీనటులు సహకరించకపోవటం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కుని బ్యాంక్ ధియోటర్లోకి దిగింది. అయితే కథన బలం లేక ధియోటర్లో చతికిలపడింది. రిజర్వాయర్ డాగ్స్, డాగ్ డే ఆఫ్టర్ నూన్, బ్లూ స్ట్రీక్ వంటి బ్యాంకు దోపిడీ సినిమాలు కలిపి తయారు చేసిన ఈ సినిమాలో రఘువరన్, జాకీష్రాఫ్, అర్చన, రాహుల్ దేవ్ వంటి వారు ఉన్నా ఉపయోగం లేకపోయింది. దాంతో నిర్మాత దర్శకుడు బి.అరుణ్ కుమార్ ఆశలు కుప్పుకూలిపోయాయి.

ఇక షారూఖ్ మై హూనా ప్రీమేక్ గా వచ్చిన శ్రీశైలం కూడా ఈ వారం ప్రేక్షకులను ఏడ్పించింది. గతంలో శ్రీహరికి ఎన్నో హిట్స్ ఇచ్చిన కె.ఎస్.నాగేశ్వరరావు ఈ సారి పూర్తిగా గ్రిప్ కోల్పోయారు. టెర్రరిజం పై పోరు, దేశభక్తి అంటూ సహన పరీక్ష పెట్టారు. కృష్ణంరాజు, నాగబాబు, సుజిత, మురళి శర్మ, సుహానీ, బ్రహ్మానందం, వేణుమాధవ్, చిత్రం శ్రీను వంటి వారు చేసినా ఉపయోగం లేకపోయింది.

అలాగే మరో నూతన దర్శకుడు పాము శ్రీనుని పరిచయం చేస్తూ వచ్చిన చిత్రం వేట. బాలాదిత్య,స్వాతిప్రియ జంటగా చేసిన ఈ చిత్రం అస్సలు రిలీజైందనే సంగతి కూడా తెలినీయని పరిస్ధితిలో పడింది. పాటలు లేకుండా చేసిన ఓ ప్రయోగం దర్శక, నిర్మాతలు పేర్కొన్నా...అస్సలు ఏమీ లేని చిత్రంగా వెళ్ళిన కొద్ది మంది ప్రేక్షకులు తీర్పు ఇచ్చి ఫ్లాఫ్ చేసారు.

పై చిత్రానికి తోడుగా సాయిభాను అనే నూతన దర్శకుడు మంజీర అనే చిత్రంతో తెలుగు పరిశ్రమను పలకరించాడు. గౌతమ్, శ్రీదేవి జంటగా రూపొందిన ఈ చిత్రం కృష్ణవంశి గులాబి చిత్రంలా హీరోయిన్ ని దుబాయి సేట్ కి అమ్మేయిటం, యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపారు. అయితే కాస్టింగ్ సరిగా లేకపోవటం, అవగాహన లేని దర్శకత్వం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టాయంటున్నారు. ఏదైమైనా ఈ నాలుగు చిత్రాలూ మొదటి రోజే ప్లాప్ టాక్ ని నమోదు చేసుకున్నాయి. ఉన్నంతలో శ్రీహరి శ్రీశైలం చిత్రమే బి,సి సెంటర్లలో ఆడతుందేమోనని దర్శక,నిర్మాతల్లో ఆశ కల్గిస్తోంది. ఇక నిన్న రిలీజైన కొంచెం ఇష్టంగా..కొంచెం ఇష్టంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకుంది. ఇప్పటికీ అనూష్క అరుంధతే టాప్ ఛెయిర్ లో కొనసాగుతోంది. ఈ యేడాది ప్రారంభంలోనే బిగ్గెస్ట్ హిట్టు రావటం సంతోషపరిచే సంగతి.

Please Wait while comments are loading...