Don't Miss!
- News
vastu tips: అప్పుల బాధలు పడలేకపోతున్నారా? ఈ వాస్తుదోషాలు సరి చేసుకోండి!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
అవెంజర్స్ వసూళ్ల వరద.. టైటానిక్ రికార్డు బ్రేక్.. 11 రోజుల్లోనే టాప్ రికార్డులు గల్లంతు!
Recommended Video
బాలీవుడ్ అగ్రహీరోల చిత్రాలకంటే భిన్నంగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం వసూళ్ల వరదను పారిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగానే కాదు.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం రికార్డుల మోత మోగిస్తున్నది. రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిన తర్వాత ఈ చిత్రం కలెక్షన్ల రికార్డులను పరుగులు పెట్టిస్తున్నది. రెండువారంలోకి ప్రవేశించిన కలెక్షన్లు తగ్గుముఖం పట్టకపోవడం గమనార్హం. గత 11 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

రూ.400 కోట్ల క్లబ్‌వైపు
ప్రతీ సోమవారం ఏ సినిమాకైనా అగ్నిపరీక్షే అని చెప్పవచ్చు. అయితే అలాంటి సోమవారం రోజున వసూళ్ల పరీక్షను అవెంజర్స్ అధిగమించింది. రిలీజ్ తర్వాత రెండో సోమవారం ఈ చిత్రం రూ.10 కోట్ల వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం రూ.300 కోట్ల మైలురాయిని దాటింది. దాంతో మొత్తంగా ఈ చిత్రం రూ312 కోట్లకుపైగా వసూళ్లను సాధించి.. 400 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతున్నది.

11 రోజుల్లోనే 300 కోట్లు
అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రానికి సంబంధించిన వసూళ్లను పరిశీలిస్తే.. గత మంగళవారం రూ.26.1 కోట్లు, బుధవారం రూ.28.5 కోట్లు, గురువారం రూ.16 కోట్లు, శుక్రవారం రూ.12 కోట్లు, శనివారం రూ.18 కోట్లు వసూలు, ఆదివారం రూ.21.75 కోట్లు చేసింది. దాంతో ఈ చిత్రం రూ.300 కోట్ల మైలురాయిని అధిగమించింది.

టైటానిక్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్
ఇక ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను పరిశీలిస్తే.. ఈ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించిన రెండో చిత్రంగా ఆల్ టైమ్ రికార్డును చేరుకొన్నది. ఈ చిత్రం 2.188 బిలియన్ల డాలర్లను వసూలు చేసింది. దాంతో టైటానిక్ సాధించిన ఆల్ టైమ్ రికార్డును అవెంజర్స్ కేవలం 11 రోజుల్లోనే అధిగమించింది.

టాప్ 5 చిత్రాల జాబితాలో
అవెంజర్స్ ప్రపంచ వసూళ్లలో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. 2 బిలియన్ డాలర్లు సాధించిన ఐదు చిత్రాల్లో ఒకటిగా ఈ చిత్రం నిలిచింది. ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకొన్న అవతార్ చిత్రం 2 బిలియన్ల రికార్డును 47 రోజుల్లో చేరుకొంటే.. అవెంజర్స్ చిత్రం కేవలం 11 రోజుల్లోనే చేరుకోవడం సినిమాకు ఉన్న ఆదరణను చెప్పింది.