Don't Miss!
- News
చంద్రబాబు కంటే నారా లోకేష్ పది ఆకులు ఎక్కువే చదివాడుగా..!!
- Sports
IND vs NZ: వారెవ్వా సుందర్.. వాటే రిటర్న్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కివీస్ బ్యాటర్! వీడియో
- Lifestyle
మీ పార్ట్నర్తో బంధంలోని స్పార్క్‌ని మేల్కొలపండి, ఇలా బెడ్రూములో హీట్ పెంచండి
- Travel
గురజాడ నడియాడిన నేలపై మనమూ అడుగుపెడదామా!
- Technology
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
- Finance
Accenture: ఐటీ సంస్థలు మారాలంటున్న యాక్సెంచర్ ప్రతినిధి.. బంగారు భవిష్యత్తు కోసమే..
- Automobiles
రూ. 50000 తో ప్రారంభమైన '2023 టయోటా ఇన్నోవా క్రిస్టా' బుకింగ్స్.. మరిన్ని వివరాలు
అవెంజర్స్ మరో రికార్డు.. బాక్సాఫీస్ వద్ద దూకుడు
అవెంజర్స్: ది ఎండ్‌గేమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. దేశీయ బాక్సాఫీస్ వద్ద అలజడి సృష్టిస్తున్నది. బాలీవుడ్ అగ్రహీరోల చిత్రాలకు ధీటుగా ఈ చిత్రం కాసుల పంట పడిస్తున్నది. ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.300 కోట్ల నికరవసూళ్లను రాబట్టడం గమనార్హం.
అవెంజర్స్ చిత్రం రెండో ఆదివారం కూడా ఘనంగా కలెక్షన్లను రాబట్టింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.21.50 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం మొత్తంగా రూ.311 కోట్లు వసూలు చేసినట్టయింది. ఈ వారాంతానికి ఈ చిత్రం రూ.400 కోట్లకు చేరువయ్యే అవకాశం ఉంది.

రెండో వారంలో అవెంజర్స్ సినిమా శుక్రవారం రూ12 కోట్లు, శనివారం రూ.18.25 కోట్లు వసూలు చేయడం గమనార్హం. అవెంజర్స్: ఎండ్‌గేమ్ చిత్రం అమెరికా, చైనా, భారత్ అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో కలెక్షన్లను రాబడుతున్నది. రాబర్ట్ డౌనీ జూనియర్, క్రిస్ ఎవాన్స్, క్రిస్ హెమ్స్‌వర్త్, మార్క్ రాఫెలో, పౌల్ రుడ్, బ్రీ లార్సన్ తదితరులు నటించిన చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకట్టుకొంటున్నది.