»   » దటీజ్ బాలయ్య: 'లయన్' టోటల్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

దటీజ్ బాలయ్య: 'లయన్' టోటల్ కలెక్షన్స్ (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొదటి రోజు న వచ్చిన టాక్ కు అణుగుణంగానే బాలకృష్ణ తాజా చిత్రం 'లయన్' ఓ ఫ్లాప్ షో గా మిగిలిపోయింది. ఈ చిత్రం పూర్తి లెక్కలు చూసి, బిజినెస్ క్లోజ్ చేస్తే...దాదాపు 17 కోట్లు వరకే వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమచారం. ఇందులో పాజిటివ్ యాంగిల్ ఏమిటీ అంటే ఈ మధ్యకాలంలో ఏ నందమూరి హీరో ప్లాఫ్ సినిమాకు ఈ రేంజి కలెక్షన్స్ రాలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఇప్పుడీ కలెక్షన్స్ ప్రభావం బాలకృష్ణ తదుపరి చిత్రం డిక్టేటర్ పై ఖచ్చితంగా పడుతుందంటున్నారు. అయితే అది పాజిటివ్ యాంగిలే . క్రేజ్ లేని ఓ కొత్త దర్శకుడు ...ఇచ్చిన ఫ్లాఫ్ చిత్రానికే 17 కోట్లు వసూలు చేస్తే...ఇక హిట్ కాంబినేషన్ లో వచ్చే చిత్రానికి ఏ రేంజిలో కలెక్షన్స్ వస్తాయనేదానిపై అంచనాలు వేసి బిజినెస్ జరుగుతుంటున్నారు.


లయిన్ టోటల్ కలెక్షన్ (షేర్):


నైజాం: రూ 4.20 కోట్లు


సీడెడ్: రూ 3.30 కోట్లు


ఉత్తరాంధ్ర: రూ 1.81 కోట్లు


గుంటూరు: రూ 1.66 కోట్లు


కృష్ణా రూ 1.00 కోట్లు


తూర్పు గోదావరి : రూ 1.14 కోట్లు


పశ్చిమ గోదావరి: రూ 1.10 కోట్లు


నెల్లూరు: రూ 0.89 కోట్లు


లయిన్ ఎపి & నైజాం టోటల్ కలెక్షన్స్: రూ 15.10 కోట్లు


లయిన్ ప్రపంచ వ్యాప్త కలెక్షన్స్ : రూ 16.8 కోట్లు (కర్ణాటక తో కలిపి: రూ 1.35 కోట్లు; భారత్ లో మిగిలిన ప్రాంతాలు: రూ 0.35 కోట్లు).


Balakrishna's “Lion” Total Collections

కథేమిటంటే....


ముంబైలోని మనోహర్ హాస్పటిల్ లో ...కోమాలో ఉన్న గాడ్సే(బాలకృష్ణ) ఒకరోజు లేచి కూర్చుంటాడు. చాలా కాలం తర్వాత స్పృహలోకి వచ్చిన గాడ్సే...తన పేరు బోస్ అని గాడ్సే కాదని చెప్తూడు. అంతేకాక అక్కడకి వచ్చిన తల్లితండ్రులు(చంద్రమోహన్, జయసుధ)లను, భార్య (రాధికా ఆప్టే)ని గుర్తుపట్టక...వాళ్లు అసలు తన వాళ్ళే కాదని పొమ్మంటాడు. అంతటితో సరిపెట్టక..సరయు(త్రిష) రోడ్డు మీద కనపడితే..ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని వెనకపడతాడు .


ఓ ఇంటికి వెళ్లి అది తన ఇల్లే అంటాడు. అక్కడున్న చలపతిరావు, గీతలను తన తల్లితండ్రులు అంటాడు. ఇంతకీ గాడ్సే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు. అదేమన్నా హెల్త్ ప్లాబ్లమా..లేక అతను చెప్పేది నిజమేనా... ఇంతకీ ..అతను చెప్పే బోస్ ఎవరు...ముఖ్యమంత్రి (ప్రకాష్ రాజ్) కు గాడ్సేకు వైరం ఏమిటి... బోస్, గాడ్సే వేరు వేరా..ఒకరేనా అనే విషయాలు తెలుసుకోవాలంటే ...సినిమా చూడాల్సిందే.


బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్‌ ప్రసాద్‌, కూర్పు: గౌతంరాజు

English summary
Balakrishna starrer 'Lion' ended as a failure. Lion Worldwide Total Collections: Rs 16.8 Crore (including Karnataka: Rs 1.35 crore; Rest of India: Rs 0.35 crore).
Please Wait while comments are loading...