For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  'బ్లూ’ వందకోట్ల నీలి సముద్రం అత్యద్భుతం!

  By Sindhu
  |

  బాలీవుడ్ విజయాలకోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీకావు. అయినా విజయాన్ని చేదించలేకపోవడంతో లోపం ఎవరిలో ఉన్నట్టు? నూరు కోట్ల బడ్జెట్! హేమా హేమీలైన తారాగణం! హాలీవుడ్ రేంజ్ లో నిర్మాణం కళ్ళు ఆర్పకుండా చూడాల్సిన ప్రదేశాలు, హై క్వాలిటీ చిత్రీకరణ! మన చిత్రసీమ ఊహించడానికే కష్టంగా తోచే అండర్ వాటర్ లో ఆద్యాంతం షూటింగూ వెరసి 'బ్లూ" సినిమా. ఈ చిత్రానికి పొగడ్తలతో ముంచెత్తి అందలమెక్కించారు. దాంతో ఈ సంవత్సరంలో 'బ్లూ" నెం.1 చిత్రమవుతుందనుకొన్నారు!మరి ఫలితం మాత్రం రివర్స్ అయింది. ఆ పాపం దర్శకుడైన 'ఆంథోనీ డిసౌజా" దేనేమో!

  పాపం అక్షయ్ కుమార్ ఆశలు ఆకాశాన్నందుతుంటే విజయం మాత్రం నీటిపాలవుతోంది. (మరి సినిమా అంతా నీటిలోనేగా!) అగ్రతారాగణం, హొయలు, సొగసులు లాంటి హంగూ ఆర్భాటాలు ఎన్ని ఉన్నా కథ ముందు ఇవేవీ సాటిరావని ప్రేక్షకులు చెప్పినా వీళ్లకి అర్థం అవ్వదెందుకో! అర్థంకాని, అర్థంలేని చిత్రాలను తీస్తే వాటిని ఆదరించేవారే కరువవుతున్నారా? లేదా?. పెద్దగా స్టోరి లేకపోయినా ఒక డిఫ్రెంట్ కథనంతో కొత్తదనంతో కమర్షియల్ హంగులతో, టెక్నికల్ గా తీస్తే ఆ చిత్రాలను మనసారా ఆహ్వానిస్తున్నారా లేదా? అయినా మేము పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని భీష్మించుకొని కూర్చున్న వారిని మనమేం చేయగలం?! సినిమాలను బెడిసికొట్టడం తప్ప!

  అయినా ఈ సినిమాలో అనేక అంశాలను అవసరానికి మించి మరీ తెరపై ఎక్కించినా ముఖ్య 'కథ" అంశం మిస్సయింది. ఆ లోటు సినిమా చూస్తున్నంతసేపూ 'పంటి కింద రాయి"లా తగులుతూనే వుంది. నూరు కోట్లుకు నూరుశాతం న్యాయం చేకూర్చలేకపోయినా. సముద్రగర్భంతో ఇమిడి ఉన్న అందచందాలని, సౌదర్యాన్నీ, సుందర సాగరతీరాలను వెండితెరపై చూడాలని కోరిక ఉన్నవారు, యాక్షన్ సీన్ల పై ఎక్కువ మక్కువ కలవారూ ఈ చిత్రం చూడొచ్చు. మొత్తానికి ఈ సినిమా లాభాలను గడిస్తుందో లేదో కానీ రెండు గంటలపాటూ సముద్రంలో దశ్యాలు చూసీ చూసీ థియేటర్ లో నుండి బయటకొచ్చేసరికి మనకు మాత్రం శ్వాసఆడనట్లవడం ఖాయం.

  ఇక కథ అంటారా మన దేశ స్వాతంత్య్రం తర్వాత మొదలవుతుంది. 1949లో బ్రిటన్‌ మనవద్దనుండి దోచుకొని పంపిన నిధిని తిరిగి మన దేశానికి ఇవ్వడానికి (విడ్డూరంగా లేదూ ఈ ఆలోచన? గాంధీ ఉత్తరాలనే తిరిగివ్వడానికి నిరాకరించిన బ్రిటన్‌ ఇంత అమూల్యసంపదను తిరిగివ్వడమే?! రచయితకున్న సహృదయత బ్రిటన్‌వారికంటే ఇప్పటికి కోహినూర్‌ మన దగ్గరుండేదేమో?!) 'లేడీ ఇన్‌ బ్లూ' అనే ఓడలో తీసుకొస్తోంటే ఆ ఓడ సముద్రం మధ్యలో మునిగిపోతుంది. ఆ మునగడం కూడా విచిత్రంగా బ్రిటన్‌కు, భారత్‌కూ మధ్య దారిలో ఏ మాత్రం తగలని 'బహరస్‌' దేశంలో మునుగుతుంది! (ఇక్కడ మళ్ళీ రచయిత క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌! మంచి లొకేషన్లకోసం దర్శకుడికి బహరస్‌ కావాలి. అందువల్ల ఆ ఓడను అమాంతం ఎత్తి అక్కడ ముంచాడన్నమాట!) ఆ ఓడ కెప్టెన్‌(కబీర్‌బేడీ)పై కావాలనే ఓడను ముంచేశాడనే నింద మోపబడుతుంది. అది భరించలేని అతను ఆత్మహత్య చేసుకుంటాడు.

  అక్షయ్ సంగతి తెలిసిందేగా?! సాహసాలంటే ప్రాణం. అందుకోసం ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేస్తాడు. అందుకు తగ్గ పాత్ర దొరికేసరికి ఎంజాయ్ చేస్తూ నటించేశాడు. నాటీ జాయెద్‌ ఖాన్ బైక్‌ యాక్షన్‌ సీన్లన్నీ అక్షయ్ లానే ఒరిజినల్‌గా చేశాడు. రాహుల్‌దేవ్‌ ఓకే! సంజయదత్‌ అంతంత మాత్రమే. ఇందుకు వయసు మీద పడటం ఒక్కటే కారణం కాదు. సినిమాలో అతని పాత్ర కూడా 'జీవం లేక‌" ఏదో కోల్పోయినట్లు ఉండటమే! పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాడని చెప్పాలేమో! 'సిజలింగ్‌' లారాదత్తా పాపం ఎక్స్ పోజింగ్ తో చాలా కష్టపడింది. మరి 'ఎవరి కడుపాత్రం వారిది కదా!' సాగరంలో మత్స్యకన్యను తలపించిందంటే నమ్మండి. పైగా అప్పటిదాకా ఈత రాని లారా ఈ సినిమాలో చాలా 'కష్టపడాలని' ఈతకూడా నేర్చుకుందట! అయినా సినిమాను గటెక్కించలేకపోయింది. గట్టుచేరని ఈత ఎంతొచ్చినా ఏం ప్రయోజనం?! కత్రినా ఉన్నా 'నటన'కు పెద్ద అవకాశం లేకుండా పోయింది. లారా ముందు 'కత్రినా' సోసో అన్నమాట! అంతర్జాతీయ షోగర్ల్‌ ప్లస్‌ సింగర్‌ కైలీ మోనోగ్యు 'జిగి విగి' సాంగ్‌లో మెరుపులా మెరిసింది. ఇందుకు ఆమె తీసుకున్న మొత్తం అక్షరాలా ఐదు కోట్లు.

  ఇక ఇతర పాత్రలైతే...ఆరవ్‌(అక్షయ్ కుమార్‌) 'బహరస్‌'లో అత్యంత ధనికుడు. సాగర్‌(సంజయ్ దత్‌) సముద్రాన్నే నమ్ముకుని చేపలు పట్టుకుని జీవించేవాడు. అతనికీ, ఆరవ్‌కీ మంచి స్నేహం. ఆరవ్‌ పదేపదే లేడీ ఇన్‌ బ్లూ గురించి సాగర్‌ను ఆరాతీసినా పెదవివిప్పడు. అనుకోని పరిస్థితుల్లో మాఫియా చేతుల్లో చిక్కుకున్న సాగర్‌ తమ్ముడు సమీర్‌ ఉరఫ్‌ శామ్‌(జాయెద్‌ఖాన్‌) అన్న చెంత చేరతాడు. ఆరవ్‌ద్వారా అన్నకు నిధి ఆచూకీ తెలుసునన్న వాస్తవాన్ని తెలుసుకుంటాడు. స్నేహితుడూ, తమ్ముడూ కలిసి నిధి వివరాలు చెప్పమని పదేపదే అడుగుతూ మూడొంతుల సినిమాని సాగదీస్తారు. సాగర్‌ద్వారా నిధి వివరాలను సేకరించేసరికి వాళ్లతోపాటూ మనకే విసుగు వచ్చేస్తుంది చివరికి ముగ్గురూ కలిసి నిధికై సాగరంలోకి దూకుతారు. తర్వాతేమైంది? నిధి గురించి సాగర్‌కెలా తెలుసు? అది ఆరవ్‌కెలా తెలుసు? అమ్మా అన్నీ నేనే చెబితే ఎలా మీరూ వెళ్ళి 'బ్లూ' చిత్రం చూడండి.

   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more