»   » నిజంగా రైట్స్ కు అంత డిమాండ్ ఉందా?

నిజంగా రైట్స్ కు అంత డిమాండ్ ఉందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Competition to remake Bobby Jasoos
హైదరాబాద్: విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బాబీ జాసూస్ చిత్రానికి సౌత్ ఇండస్ట్రి నుంచి భారీగా రీమేక్ ఆఫర్స్ వస్తున్నట్లు బాలీవుడ్ చెప్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఆమె టాప్ డిటెక్టివ్ అవ్వాలనే కోరిక ఉన్న అమ్మాయిగా చేస్తోంది. దియా మీర్జా మరో కీలకపాత్ర చేస్తున్న ఈ చిత్రం జూలై 4 న విడుదల అవుతోంది. రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ ఉండటంతో నిర్మాతలు రీమేక్ రైట్స్ కు భారీ ఎమౌంట్ చెప్తున్నట్లు ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే ఆమె నటించిన కహాని చిత్రం ఇక్కడ అనామిక గా రీమేక్ అయ్యి ఫ్లాఫ్ అయ్యింది. మరో ప్రక్క బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన క్వీన్ చిత్రం సౌత్ రీమేక్ కి హీరోయిన్, దర్శకుడుని వెతుకున్నారు.

ఇక బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ హీరోయిన్‌గా పాపులర్‌ అయ్యింది విద్యాబాలన్‌. పద్ధతిగా ఉన్ననాన్నళ్లు రాని క్రేజు బోల్డ్‌ క్యారెక్టర్స్‌ చేస్తూ అందిపుచ్చుకుంది. సిల్క్‌స్మిత జీవితకథతో తెరకెక్కిన డర్టీపిక్చర్‌ లో విద్యా బోల్డ్‌ పెర్ఫామెన్స్‌కి లోకం దాసోహం అయ్యింది. ఆ ఒక్క సినిమాతో అమ్మడి స్టార్‌ రేంజ్‌ మారిపో యింది. మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా బాలీవుడ్గ దర్శకనిర్మాతల కళ్లలో ఇంకిపోయింది. డర్టీపిక్చర్‌ తర్వాత కహానీ సినిమాతో మరో మెట్టు పైకెక్కింది. గొప్ప అభినయనేత్రిగా సినిమాకు చేసిన సేవలకు పద్మశ్రీ అవార్డును సైతం కైవశం చేసుకుంది. సీనియర్‌ నాయికలంతా కుళ్లుకుపోయే రేంజును అతి పిన్నవయసులోనే చూపించింది. అంతటి ఈ నవయవ్వని.. ఇప్పుడు 12రకాల వైవిధ్యమైన గెటప్‌లతో నటిస్తూ మరోసారి పరిశ్రమలో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

బాబీ జాసూస్‌ అనే చిత్రంలో విద్యాబాలన్ ...ఏకంగా ఆరు గెటప్పుల్లో మగరాయుడిగా కనిపించనుంది. ఈ సినిమా ఆద్యంతం హైదరాబాద్‌ పరిసరాల్లో తెరకెక్కిం చారు. పాతబస్తీలో ఈ అమ్మడిని చూసి ఎవరో అనుకునేంత గొప్పగా గెటప్‌లో ఇమిడిపోయిందంటే ఆలోచించండి. ఏదేమైనా బాబీ జాసూస్‌ చిత్రీకరణ పూర్తయింది. నిన్ననే హైదరాబాద్‌ ఐమాక్స్‌లో ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. అక్కడ తెగ సందడి చేసింది. దక్షిణాది భామనే అయినా తెలుగులో నటించలేకపోయా. సరైన కథలు రాకే ఇక్కడ నటించడం లేదు.. అని చెప్పింది. అంతేకాదు .. నిన్న నాగార్జున మీలో కోటీశ్వరుడు ఎవరు కార్యక్రమంలో పాల్గొన్నా. నాగ్‌ని చూసి స్టన్నయిపోయా. ఈ వయసులోనూ ఆయన దేహశిరిని చూసి ఆశ్చర్యపోయా..నని అంది. హీ ఈజ్‌ గ్రేట్‌.. అని తెగ పొగిడేసింది.

English summary
Filmmakers are competing with each other to bag the rights of yet to be released Vidya Balan's film Bobby Jasoos. Remake rights are touching stars due to the demand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu