»   » ‘డి ఫర్ దోపిడి’ శాటిలైట్ రైట్స్ ఎంత?

‘డి ఫర్ దోపిడి’ శాటిలైట్ రైట్స్ ఎంత?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ సందేష్, సందీప్ కిషన్, మెలని, నవీన్, రాకేష్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ రూపొందుతున్న చిత్రం 'డి ఫర్ దోపిడి'. దొబ్బడానికి? దొబ్బించుకోడానికా? అనేది సబ్ టైటిల్. హిందీలో '99', 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కెలు 'డి ఫర్ దోడిపి' చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. సిరాజ్ కల్లాన్ని ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రం నిర్మాణ టీమ్ లో హీరో నాని కూడా జాయిన్ అయ్యారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోటి డబ్బై లక్షలుకు జెమినీ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం.


ఎప్పటినుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నాం. మా దర్శకత్వంలో ఓ సినిమా తీయడానికంటే ముందు ఒక తెలుగు చిత్రాన్ని నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్న మాకు సిరాజ్‌ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభించాం. హిందీలో మేం రూపొందించిన షోర్‌ ఇన్‌ ద సిటీ అనే చిత్రానికి అతను అసోసియేట్‌ డెరెక్టర్‌గా పనిచేశారు. తెలుగు సినిమాలు చూస్తూ పెరిగిన మేం తెలుగు నేటివిటీకి అనుగుణంగా నిర్మిస్తున్న చిత్రమిది. క్రైమ్‌, కామెడీ, సెటైర్‌ అంశాలతో తయారవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించే సినిమాలు తీయాలన్నది మా ధ్యేయం. వచ్చే ఏడాది రెండు తెలుగు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం అని తెలిపారు.

 For Dopidi' Satellite Rights @ Rs 1.7 Cr

చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాని మాట్లాడుతూ- ఇబ్బందుల్లో ఉన్న నలుగురు కుర్రాళ్లు ఓ దొంగతనం చేసి ఎటువంటి పరిణామాలకు గురయ్యారనే కధాంశంతో వినోదాత్మకంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, సన్నివేశంలో హాస్యం ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడని, సినిమా చూస్తేనే నచ్చుతుందని తెలిపారు. తెలుగులో ఓ మంచి చిత్రం తీయాలనే తమ కోరిక ఈ చిత్రంతో తీరిందని, దర్శకుడు కధ చెప్పిన వెంటనే నచ్చి సినిమా ప్రారంభించామని, సినిమా మొత్తం పూర్తయిందని, త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని, నాని, రాజు ఈ సినిమాతో అసోసియేట్ కావడం సంతోషంగా ఉందని నిర్మాతలు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్‌లో ప్రధాన భాగమైన రాజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడం సంతోషంగా ఉందని, ఈ సినిమా మొదటినుండీ చివరివరకూ ప్రేక్షకులను నవ్విస్తుందనీ, తొలి సక్సెస్‌గా తాము ఈ చిత్రాన్ని భావిస్తున్నామని దర్శకుడు సిరాజ్ కల్ల తెలిపారు.


క్రైం, కామెడీ నేపథ్యంలో ఈచిత్రం సాగుతుంది. ప్రేక్షకులకు సస్పెన్స్ తో పాటు థ్రిల్, కామెడీని ఈచిత్రం నుంచి ఆశించ వచ్చు. ఈ చిత్రంలో ఇంకా తనికెళ్ల భరణి, హేమ, పృథ్వి, పావలా శ్యామల తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మహేష్ శంకర్, కెమెరా: లుకాస్, కళ: ఉపేంద్ర రెడ్డి, కూర్పు: ధర్మేంద్ర, నిర్మాతలు: రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కె, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా.

English summary

 ‘D For Dopidi’, the film that is about to release has bagged a whopping Rs 1.7 Cr through satellite rights. This is considered to be the highest in small film segment till now. But when probed into the details with Gemini TV sources regarding this, it was said that the names like Nani and Dil Raju involving in its business could get this huge sum, but not the star cast.
Please Wait while comments are loading...