twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగ్ 'డమరుకం'ఫస్ట్ డే కలెక్షన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : వాయిదాలు మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చిన నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' శుక్రవారం విడుదల అయ్యింది.డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా మంచి ఓపినింగ్స్ తెచ్చుకుని డిస్ట్రిబ్యూటర్స్ ని ,ఎగ్జిబిటర్స్ ని ఆనందపరిచింది. ఈ వీకెండ్ రెండు రోజులు అదే కలెక్షన్స్ కంటిన్యూ అవుతాయని అంటున్నారు. ట్రేడ్ లో చెప్పబడుతున్న ఆ కలెక్షన్స్ వివరాలు అలా ఉన్నాయి.

    మొదటి రోజు కలెక్షన్స్

    నైజాం: 1.5 cr
    సీడెడ్: 1.27cr
    వైజాగ్ : 37.32 lakhs
    తూర్పు గోదావరి : 32.85
    పశ్చిమ గోదావరి : 21.50
    కృష్ణా : 24.52 గుంటూరు: 39.82
    నెల్లూరు: 18.42

    'ఢమరుకం' చిత్రం మీద చాలా సినిమాల బరువు పడిందని, అందులో తన కుటుంబ సభ్యుల సినిమాలు కూడా వున్నాయని నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. నాగార్జున అయితే ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని,ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుందని చెప్తూ వస్తున్నారు.

    'ఢమరుకం'కథ ఏమిటంటే...తెలుగు పురాణేతిహాసాల ఆధారంగా తయారుచేసుకున్న కథాంశమిది. రాక్షససంహారం జరిగిన తర్వాత శత్రుశేషంగా అంధకాసురుడు అనే రాక్షసుడు ఒక్కడే మిగిలిపోతాడు. వెయ్యి సంవత్సరాలకొక్కసారి గ్రహాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి విశ్వంలో ఓ మహాద్భుతఘట్టం సాక్షాత్కరించే సమయంలో అంధకాసురుడు తిరిగి జన్మిస్తాడు. ఆ పవిత్ర ఘడియల్లో పుట్టడం వల్ల పంచభూతాలు అతని ఆధీనంలోకి వస్తాయి. అతన్ని శివుడి అంశతో జన్మించిన ఓ యువకుడు నిలువరించి లోకకల్యాణం ఎలా చేశాడు. గ్రహాలన్నీ ఒక్కటైనా ఆ పవిత్ర ముహూర్తంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నది హీరో ఆశయం. ఎలా వివాహం చేసుకున్నాడు అనేది సినిమా కథ. ఈ చిత్రంలో అంధకాసురుడి పాత్రను రవిశంకర్ పోషించారు. మానవరూపంలో వున్న శివుడిగా ప్రకాష్‌రాజ్ కనిపిస్తారు.

    నటీనటులు: నాగార్జున, అనుష్క, ప్రకాష్ రాజ్, గణేష్, వెంకట్రామన్, బ్రహ్మానందం, రఘుబాబు, యంఎస్ నారాయణ, కృష్ణ భగవాన్, జీవా బ్రహ్మాజీ, అవినాష్, దేవన్, గిరిబాబు తదితరులు
    కథ: వెలిగొండ శ్రీనివాస్,
    ఆర్ట్: అశోక్,
    ఎడిటింగ్: గౌతంరాజు,
    డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి: చోటా కె.నాయుడు,
    సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
    డాన్స్: రాజు సుందరం,
    సమర్పణ: కె. అచ్చిరెడ్డి,
    నిర్మాత: వెంకట్,
    స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి

    English summary
    Damarukam collections: Nagarjuna-starrer Damarukam has hit the screens on Friday and the film has garnered a pretty positive talk across all areas. The first day (1st day) collections of Damarukam have been impressive as the film sets the cash registers ringing. Trade sources say that Nagarjuna managed to register his career-best figures in terms of opening day collections at the Tollywood box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X