Darbar world wide collections:అదిరిపోయే ఓపెనింగ్స్.. తొలి రోజు ఎంత వసూలంటే
సూపర్‌స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన దర్బార్ చిత్రం రికార్డు స్థాయి స్రీన్లు, థియేటర్లలో విడుదలైంది. గతంలో ముందెన్నడూ లేనంతగా రజనీ కెరీర్‌లో అత్యధిక సెంటర్లలో, దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉంటాయనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

తమిళనాడులో
తమిళనాడులో దర్బార్ చిత్రానికి తొలి రోజు మంచి స్పందన లభిస్తున్నది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో భారీగా స్పందన రావడంతో రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాదిలో విడుదలైన అన్ని చిత్రాల కంటే దర్బార్ సినిమా వసూళ్లు అధికంగా ఉంటాయనే మాట వినిపిస్తున్నది. తమిళనాడులో తొలి రోజు 13 కోట్లు, చెన్నైలో రూ.1.12 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఆ సినిమా కలెక్షన్లను అధిగమించేలా ఉంటాయనేది ట్రేడ్ వర్గాలు టాక్.

తెలుగు రాష్ట్రాల్లో
ఇక రజనీకాంత్‌కు అతిపెద్ద మార్కెట్ అయిన ఏపీ, తెలంగాణలో కూడా భారీ వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది. రజనీకాంత్ పేటా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.60 కోట్లు, రూ.2.8 కోట్లు వసూలు చేసింది. కాగా ప్రస్తుతం దర్బార్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు, అడ్వాన్స్ బుకింగ్ చూస్తే రికార్డు వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లో
ఓవర్సీస్ మార్కెట్ చూస్తే.. అమెరికాలో పేటా రూ.2.65 కోట్ల షేర్, రూ.5.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక దర్బార్ చిత్రం అత్యధిక సీన్లలో రిలీజ్ కావడం, అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి క్రేజ్ లభించడం చూస్తే పేటా కంటే మంచి కలెక్షన్లను నమోదు చేయడానికి అవకాశం ఉంది. కడపటి వార్తలు అందేసరికి 158 లొకేషన్లలో దర్బార్ చిత్రం 405901 డాలర్లు వసూలు చేసింది.

కర్ణాటక, కేరళలో
తమిళనాడు, తెలంగాణేతర రాష్ట్రాల వసూళ్లను పరిశీలిస్తే.. పేట చిత్రం కర్ణాటకలో రూ.1.55 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.50 లక్షలు వసూలు చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ రిపోర్టు చేస్తే పేట సినిమా రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేరళలో రూ. 65 లక్షలు షేర్, రూ.1.4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
ఇక పేట చిత్రం ఓవరాల్ కలెక్షన్లను చూస్తే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.19 కోట్లు షేర్, రూ.36.6 గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక దర్బార్ సినిమా విషయానికి వస్తే సుమారు రూ.20 కోట్లకుపైగా షేర్‌ను, రూ.40 కోట్ల గ్రాస్‌ను రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











