»   » ‘డిక్టేటర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్... (ఏరియా వైజ్)

‘డిక్టేటర్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్... (ఏరియా వైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య నటించిన ‘డిక్టేటర్' మూవీ సంక్రాంతికి విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలు కొన్ని బయటకు వచ్చాయి. ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం శనివారం వరకు $83,644 వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలి వారాంతం(ఆదివారం వరకు) ఈచిత్రం ఏపీ, తెలంగాణల్లో రూ. 13.38 కోట్ల షేర్ సాధించినట్లు సమాచారం.

సినిమాకు కొన్ని చోట్ల మిక్డ్స్ టాక్ వచ్చినా బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు ఆశాజనకంగా ఉన్నాయని అంటున్నారు. తొలి వారాంతం కాబట్టి కలెక్షన్లు నిలకడగానే ఉన్నాయి. అయితే సోమవారం ఏ మేరకు కలెక్షన్లు వస్తాయనే దానిపైనే సినిమా భవిష్యత్తును అంచనా వేయొచ్చని అంటున్నారు.


‘డిక్టేటర్' చిత్రం మాస్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం కావడంతో బి, సి సెంటర్లలో బాగానే ఆడుతోంది. అయితే ఎ సెంటర్లలో మాత్రం ఆశించిన మేర కలెక్షన్స్ రావడం లేదని అంటున్నారు. సంక్రాంతికి విడుదలైన నాలుగు సినిమాల్లో చాలా మంది తొలి రెండు ఆప్షన్లలో నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయనా... చిత్రాలను ఎంచుకుంటున్నారు. ఈ రెండు సినిమాల తర్వాతే డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.


అయితే బాలయ్య సినిమా కావడంతో ఓపెనింగ్స్ బావున్నాయి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ ఈ చిత్రం దాదాపు రూ. 20 కోట్ల షేర్ సాధించినట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఏరియా వైజ్ కలెక్షన్స్ డిటేల్స్ స్లైడ్ షోలో...


నైజాం

నైజాం

నైజాంలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ రూ. 2.80 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ రూ. 3.20 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.


వైజాగ్

వైజాగ్

వైజాగ్ ఏరియాలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ రూ. 1.46 కోట్లు వసూలు చేసినట్లు టాక్.


కృష్ణ

కృష్ణ

కృష్ణ ఏరియాలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ రూ. 82 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.


గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ రూ. 1.79 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.


నెల్లూరు

నెల్లూరు

నెల్లూరులో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ రూ. 78 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.


ఈస్ట్

ఈస్ట్

ఈస్ట్ గోదావరి ఏరియాలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ రూ. 1.29 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.


వెస్ట్

వెస్ట్

వెస్ట్ గోదావరి ఏరియాలో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ రూ. 1.24 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.


English summary
Balakrishna's Dictator collected $83,644 in USA till Saturday and it can be considered as a decent grosser at the overseas box office. Apparently, after its first weekend, Dictator collected a total share of 13.38 Cr in AP & TS alone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu