»   » అక్కడ 'డిక్టేటర్' పూర్తి లాస్

అక్కడ 'డిక్టేటర్' పూర్తి లాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇక్కడ మన ప్రేక్షకులు వేరు, US లో ప్రేక్షకులు వేరు. ఇక్కడ హిట్ అయ్యినవి అక్కడ పెద్దగా కలెక్ట్ చేయలేక చతికిలి పడినవి ఉన్నాయి. అలాగే ఇక్కడ ఓకే అనిపించుకున్నవి అక్కడ ఓ రేంజిలో కలెక్ట్ చేసినవి ఉన్నాయి. ఈ నేపధ్యంలో US కలెక్షన్స్ కూడా ప్రతీ సినిమాకూ కీలకం అవుతూ వస్తున్నాయి. తాజాగా సంక్రాంతికి విడుదలైన నాలుగు చిత్రాల్లో రెండింటికే US తెలుగు ప్రేక్షకులు ఓటేసారని సమాచారం.

ఆ రెండు చిత్రాలు...నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్ని నాయినా అని తెలుస్తోంది. నాన్నకు ప్రేమతో చిత్రం మొదటి నుంచి అక్కడ గట్టిగా కలెక్ట్ చేస్తుందని అందరూ ఊహించారు. అయితే సోగ్గాడే చిన్ని నాయినా మాత్రం అనూహ్యంగా అక్కడ ప్రేక్షకులకు పట్టిందని, సినిమాని వారు బాగా ఆదరిస్తున్నట్లు సమాచారం.


నాన్నకు ప్రేమతో చిత్రం అయితే మహేష్ బాబు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు కలెక్షన్స్ ని అక్కడ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. కేవలం అరవై లక్షలకు USలో తీసుకున్న సోగ్గాడే అయితే అక్కడ పెద్ద హిట్ అయినట్లే. కలెక్షన్స్ చూస్తూంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎక్సప్రెస్ రాజా కేవలం జస్ట్ ఓకే చిత్రం అనిపించుకుంది. డిక్టేటర్ అయితే పూర్తి లాస్ అంటున్నారు. అసలు కలెక్షన్స్ లేవు అని తెలుస్తోంది. పండుగ రోజు తప్పించి అక్కడ చెప్పుకోదగిన రీతిలో ఈ సినిమా వర్కవుట్ కాలేదు అంటున్నారు.


'Dictator', losses in the US with poor collections

నాన్నకు ప్రేమతో చిత్రం అమెరికాలో భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. జనవరి 13న విడుదలైన ఈ చిత్రం మూడురోజుల్లోనే యూఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద ఒక మిలియన్‌డాలర్ల కలెక్షన్‌ను అధిగమించింది.


ఈ సంవత్సరంలో తక్కువ సమయంలో మిలియన్‌ మార్క్‌ చేరిన తొలి సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. చిత్ర ఓవర్‌సీస్‌ పంపిణీదారు సినీ గెలాక్సీ ఇన్‌కార్పొరేషన్‌ ఈ వివరాలను ప్రకటించింది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు.


ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ. 30 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది.

English summary
'Dictator', incurs losses in the US with poor collections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu